అవును నిజమే… విద్య వైద్యాన్ని సర్వ నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. మళ్ళీ అధికారం లోకి రావడం కోసం, కొత్త ఉచిత పథకాలను ప్రవేశ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇండ్లు లేని వారికి నియోజక వర్గానికి వేయి మందికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలి అనే ఆలోచన ఒకటి. ఇట్లా ఇంకా ఓట్లు రాల్చే పథకాల కోసం కసరత్తు చేస్తుంది. రాష్ట్రం అప్పుల పాలు అయినా, ధరలు పెరిగినా, కరెంటు బిల్లులు, ఇంటిపన్ను, బస్ ఛార్జీలు, పెట్రోల్- డీజిల్ ఇతర పన్నులు పెంచి అయినా, ఉచిత పథకాలు ఇవ్వాలి. అధికారం నిలపెట్టుకోవాలి. అక్రమ సంపాదన చేయాలి అనే తహ తహ . అక్రమ సంపాదన తో ఎవరినైనా ఏవ్యవస్తనైన చెప్పుచేతల్లో పెట్టుకోవాలి. కాదు అంటే ఎదురు దాడి చేయాలి. మీడియాను కొనుకున్నారు. నిజాలు చెప్పే ప్రధాన మీడియా ఏది లేదు. ఆంధ్ర మీడియా మాకెందుకు వారి గోల అన్నట్లు ఉంటుంది, ఆర్థికంగా దేశం మొత్తంలో ఒకేసారి ఎన్నికలు వచ్చినా .. దేశంలో ఉన్న మొత్తం పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను నిల పెట్టే ఆర్ధిక స్తోమత ఉంది,టీఆర్‌ఎస్ పార్టీ కి ఉంది. ప్రజలారా! ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ తింటాయి, ప్రభుత్వ విద్య అత్యంత దారుణంగా ఉంది. ఎప్పుడు లేనంత దరిద్రంగా ఉంది.
దీని వలన మధ్యతరగతి ప్రజలు పిల్లల చదువుల కోసం, ప్రవేట్ స్కూళ్ళలో లక్ష నుండి ఐదు లక్షలు ఒక సంవత్సరానికి ఖర్చు చేస్తున్నారు. అదే ప్రభుత్వ విద్య బాగుంటే ఈ డబ్బులు ఆ కుటుంబానికి మిగులుతాయి. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలు అవసరం లేదు. అట్లాగే ప్రతి కుటుంబం.. సగటున సంవత్సరానికి వైద్యం కోసం యాబై వెల నుండి ఐదు లక్షలు ప్రైవేట్ ధావఖానలలో ఖర్చు చేస్తున్నారు. ఇంకా పెద్ద రోగాలు క్యాన్సర్,డయాలసిస్ లాంటి వాటికి, పది లక్షల నుండి కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే ప్రభుత్వ వైద్యం కార్పొరేట్ స్థాయిలో ఉంటే, ఈ డబ్బు కూడా ఈ కుటుంబాలకు మిగులుతాయి కదా?
యువత మొత్తం ఆర్థిక నేరస్తులైన అవినీతిపరులైన రాజకీయ నాయకులకు అభిమానులుగా ఉండటం. రాజకీయ నాయకులు ఇంకా కరప్షన్ కు తెగబడుతున్నారు.
వీరిని చీడ పురుగులలా చూసినప్పుడు వ్యవస్థ మారుతుంది. స్వతంత్రం వచ్చిన తరువాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డ కానుండి, తెలంగాణ ఏర్పడ్డ నాటి కంటే ఈ యెనిమిది ఎండ్లలో జరిగిన రాజకీయ నాయకుల కరప్షన్ సంపాదన లక్ష రెట్లు పెరిగింది. ఉచిత పథకాల కోసం ఖర్చు చేస్తున్న డబ్బు అంతా, అప్పు చేసిన డబ్బు అంతా మళ్లీ తెలంగాణ ప్రజల నుండి కక్కించాల్సిందే. వివిధ పన్నులు పెంచడం ద్వారా, అత్యధికంగా పేద- మధ్యతరగతి ప్రజలే కట్టాల్సి ఉంటుంది. కావున ప్రజలారా .. ఇది ప్రమాద కరమైన పాలన. పన్నుల రూపంలో ప్రమాదం పొంచి ఉన్నది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల సొమ్ముతో అత్యధికంగా జీతాలు తీసుకుంటూ, అక్రమ సంపాదన వేల కోట్లు చేసుకుంటూ, హాయిగా దొరల లాగా దొంగలే బ్రతుకుతున్నారు. ఈ దొంగలకే మనం అభిమానులు గా ఉండటం , మన తెలివి తక్కువ తనానికి నిదర్శనం. ఎవరో ఒక్కరు మంచి వారు ఉంటే ఉండ వచ్చు గాక.
ప్రజల ఆస్తులు పెరగటం లేదు. రాజకీయ నాయకుల ఆస్తులు పెరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వ స్కూల్ లలో , కాలేజీలలో, ఎంపీల ఎమ్మెల్యే ల ఇతర రాజకీయ పదవులలో ఉన్న కుటుంబాల పిల్లలు చదివినప్పుడు మాత్రమే, విద్య బాగు పడుతుంది. అట్లాగే ప్రధాన మంత్రి నుండి, ముఖ్య మంత్రులు- మంత్రులు- ఎమ్మెల్యే లు- ఎంపీ లు ప్రభుత్వ ధావఖానలలో వైద్యం పొందినప్పుడే వైద్య వ్యవస్థ బాగుపడుతుంది. అవసరం అయితే చట్టం చేయాలి. అందుకే వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీపార్టీలు.. ఉచితంగా విద్య వైద్యం ఇస్తాం అని మ్యాన్ పెస్టో లో పెట్టి ఎన్నికలకు రావాలి. అట్లా వచ్చిన రాజకీయ పార్టీకి మాత్రమే ఓటు వేయాలి.