– ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి గణనీయంగా పాడిపోతుండటం ఆందోళనకరం. ఇటీవల విడుదలైన CAG మంత్లీ కీ ఇండికేటర్ల ప్రకారం, రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం (SOTR) 2023-24లో రూ.1,24,146.19 కోట్లు కాగా, 2024-25 నాటికి రూ.1,24,054.38 కోట్లకు తగ్గి, రూ.91.81 కోట్ల తగ్గుదల నమోదైంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో తప్ప రాష్ట్రంలో ఇంతటి తగ్గుదల ఎప్పుడూ కనిపించలేదు. 2014-15 నుండి 2022-23 వరకు బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ 12% CAGR తో సొంత పన్నుల ఆదాయ వృద్ధిని సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లేని పాలన రాష్ట్ర వృద్ధి తగ్గుదలకు కారణమయ్యాయి.