అమరుల స్మారక చిహ్నం ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలి

Spread the love

-సీఎం కేసిఆర్ విధించిన నిర్ణీత గడువులోగా పూర్తి కావాలి
-అతి త్వరలో సీఎం కేసిఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు…హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ తుదిదశ పనుల పురోగతిని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం నాడు పరిశీలించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో తుదిదశ పనుల్లో వేగం పెంచాలని అధికారులను,వర్క్ ఏజెన్సీ ని మంత్రి అదేశించారు.

అనంతరం సెక్రటేరియట్,అమరవీరుల స్మారక స్థూపం ముందు జరుగుతున్న రోడ్లు జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.మంత్రి వెంట ఆర్ అండ్ బి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.

Leave a Reply