Suryaa.co.in

Telangana

తెలంగాణ పోలీసులు సంజయ్ మొబైల్ ను చోరీ చేశారు

-వరంగల్ కమిషనర్… మీరు మాలిక్ కాదు…. సేవకుడివి మాత్రమే
-కేసీఆర్ కుటుంబాన్ని జైల్ కు పంపేదాకా పోరాడతాం
-తెలంగాణలో లీకేజీ మాఫియా నడుస్తోంది. లిక్కర్, అవినీతి, కేబుల్, డ్రగ్స్, లూట్ మాఫియా
-సుఖేష్ ఎవరికి నిధులిచ్చారు? లిక్కర్ క్వీన్ ఎవరు? మీ పాత్ర లేకుంటే ఎందుకు భయపడుతున్నారు?
-టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనుక కేసీఆర్ కుటుంబ పాత్ర
-రాజ్యాంగం ప్రకారం వ్యవహారించాలే తప్ప కేసీఆర్ చెప్పినట్లు కాదు
-కేసీఆర్ కుటుంబంలో ఒకరు లిక్కర్ దందా, మరొకరు పేపర్ లీకేజీ దందాలు చేస్తున్నారు
-తెలంగాణలో జంగల్ రాజ్ నడుస్తోంది
-తక్షణమే కేబినెట్ నుండి కేటీఆర్ ను బర్త్ రఫ్ చేయాలి
-రేవంత్ రెడ్డి తొలుత తన ఇంటిని చక్కదిద్దుకుంటే బెటర్
-కేసీఆర్ ఇటలీ కళ్లద్దాలతో చూస్తున్నారు
-బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్

కరీంనగర్ లోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నివాసంలో జరిగిన ప్రెస్ మీట్ లో బండి సంజయ్, ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు జె.సంగప్ప, పోరెడ్డి కిశోర్ రెడ్డి, కార్యదర్శులు జయశ్రీ, ఉమారాణి, శ్రీనివాస్ గౌడ్ తదితరులతో కలిసి తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడారు..

ఈ సందర్భంగా తరుణ్ చుగ్ ఏమన్నారంటే… ఈనెల 5న అర్ధరాత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాల మేరకు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధం. న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. కొందరు పోలీసు అధికారుల కేసీఆర్ చేతిలో బందీ అయ్యారు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ చెప్పినట్లు ఆడుతున్నారు. మీరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు. రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. రాజ్యాంగం ప్రకారం వ్యవహారించాలే తప్ప కేసీఆర్ చెప్పినట్లు కాదు.నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం అక్రమం. బండి సంజయ్ విడుదల 30 లక్షల నిరుద్యోగుల, లక్షలాది మంది విద్యార్థుల, 4 కోట్ల ప్రజల విజయం. కేసీఆర్ సర్కార్ కు చరమగీతం పాడేందుకు పోరాడుతున్న వారందరి విజయమిది. ధర్మం గెలిచింది . సత్యమే గెలిచింది. అహంకారంతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న ప్రభుత్వం అనాగరికంగా వ్యవహరిస్తోంది. వారెంట్ లేకుండా ఎంపీని అరెస్ట్ చేయడం చూస్తే తెలంగాణలో జంగల్ రాజ్ నడుస్తోంది. కేసీఆర్… రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలే తప్ప కుటుంబ పాలన కాదు. 30 లక్షల మంది నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారు. వారి పక్షాన బండి సంజయ్ పోరాడుతున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనుక కేసీఆర్ కుటుంబ పాత్ర ఉంది. తెలంగాణలో లీకేజీ మాఫియా నడుస్తోంది. లిక్కర్, అవినీతి, కేబుల్, డ్రగ్స్, లూట్ మాఫియా నడుస్తోంది. ప్రతిష్టాత్మకమైన టీఎస్పీఎస్సీ పేపర్ ఎట్లా లీకైందో చెప్పకుండా, దోషులను తేల్చకుండా చర్చను దారి మళ్లించడానికి టెన్త్ పేపర్ లీకేజీ కుట్రను తెరపైకి తెచ్చారు.

కేసీఆర్ ప్రభుత్వానిది ఆలీబాబా 40 దొంగల రాజ్యం.తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పాలనపట్ల తీవ్ర ఆక్రోశంతో ఉన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్ కు పంపేదాకా పోరాడతాం… ప్రజలు మిమ్ముల్ని జైలుకు పంపే రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. బండి సంజయ్ ను జైళ్లో వేస్తే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని పోరాటం ఆగిపోతుందని భావిస్తే పొరపాటే. బండి సంజయ్ పక్షాన ప్రజలంతా ఉద్యమిస్తున్నారు. గతంలో 317 జీవోకు వ్యతిరేకంగా ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తున్న బండి సంజయ్ ఆఫీస్ గ్యాస్ కట్టర్లతో కట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం ఎవరూ మర్చిపోలేదు. పేపర్ లీకేజీ మాఫియా వెనుక ఎవరున్నారు? లీకేజీ ఎక్కడ జరిగింది? లీకేజీ కంపెనీ ఎవరిది? ఆ లీకేజీ కంపెనీతో మీ కుటుంబానికి ఏయే సంబందం ఉంది? లీకేజీ కింగ్ పిన్ ఎవరో ప్రజలకు తెలుసు. ఈ లీకేజీ వెనుక మీ కుటుంబ పాత్ర ఉందని ప్రజలకు తెలుసు.. గతంలో కేసీఆర్ కుటుంబం నిర్లక్ష్యం కారణంగా 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజల ఆక్రోశాన్ని నిలువరించడం మీ తరం కాదు…

సంజయ్ మొబైల్ ను పోలీసులే తీసుకెళ్లారు. తెలంగాణ పోలీసులు మొబైల్ చోరీ చేశారు. ఆ మొబైల్ ను ఎట్లా తీసుకోవాలో మాకు తెలుసు. నిబంధనలను ఉల్లంఘించి ఎంపీని బలవంతంగా అరెస్ట్ చేసి మానవత్వాన్ని హననం చేశారు. పోలీసులు బండి సంజయ్ ను బలవంతంగా తరలించే సమయంలో ఆయన చేతిలోనే మొబైల్ ఉన్న ద్రుశ్యాలు టీవీలో కన్పించాయి. ఆ మొబైల్ ను పోలీసులే చోరీ చేసి మళ్లీ మొబైల్ ఎక్కడుందని అడగడం విడ్డూరం. వరంగల్ కమిషనర్… మీరు మాలిక్ కాదు…. సేవకుడివి మాత్రమేనని గుర్తుంచుకో.. అబద్దాల ప్రచారం చేసే అధికారం మీకెక్కడిది? రాజ్యాంగంపై ప్రమాణం చేసి డ్యూటీ నిర్వహిస్తున్న విషయం గుర్తుంచుకోండి. కేసీఆర్ కుటుంబ పాలన 5 నెలలు మాత్రమే ఉంది. ఆ తరువాత కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడబోతున్నారు. బండి సంజయ్ బెయిల్ విషయంలో న్యాయ స్థానం ఇచ్చిన ఉత్తర్వులు కేసీఆర్ సర్కార్ కు చెంపపెట్టు.కేసీఆర్ సర్కార్ చివరి దశ వచ్చింది. టీఎస్పీఎస్పీ లీకేజీ కేసును దారి మళ్లించేందుకు పదో తరగతి పరీక్షలను తెరపైకి తీసుకొచ్చి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు.

బండి సంజయ్ అరెస్ట్ పై అడ్వోకేట్ కు వారంట్ ఎందుకు చూపలేదు? అర్ధరాత్రి బండి సంజయ్ ను అరెస్ట్ చేసే గేమ్ వెనుక కారణమేంటో ప్రజలకు తెలుసు. కేసీఆర్ బానిసలం కాదు… ప్రజా సేవకులం. ప్రజా సేవ చేస్తున్న ఎంపీకి భద్రత కల్పించాల్సిన పోలీసులు భక్షకులుగా మారారు. మీడియా ఖండించాలి. 30 లక్షల మంది టీఎస్పీఎస్సీ నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న బండి సంజయ్ ను అరెస్ట్ చేసి ఆయా నిరుద్యోగుల గొంతును అణిచివేయాలనుకుంటున్నారు. కేసీఆర్… మీ కుటుంబ పాలనపై ప్రజలు ఆక్రోశంతో ఉన్నారు. బీజేపీ నేతలను అరెస్టు చేసినా, జైలు గోడలు, ఇనుప సంకెళ్లు, జైలు ఊచలతో అడ్డుకోవాలని చూసినా ప్రజల ఆవేశాన్ని ఆపలేరని గుర్తుంచుకోవాలి. ప్రజలంతా బండి సంజయ్ పక్షాన ఉన్నారు. ప్రతి కార్యకర్త బండి సంజయ్ కు అండగా ఉంటూ పోరాడతారు. మీ కుటుంబం జైలుకు పోక తప్పదు. తెలంగాణ ప్రజల పక్షాన, 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ కోసం బండి సంజయ్ పోరాడుతున్నారు. కేసీఆర్ సర్కార్ కు చిత్తశుద్ధి ఉంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పన పరిహారం అందించాలి.

పేపర్ లీకేజీలో ఐటీశాఖ మంత్రిని కాపాడేందుకు కేసీఆర్ కాపాడుతున్నారు. తక్షణమే కేబినెట్ నుండి కేటీఆర్ ను బర్త్ రఫ్ చేయాలి. కేసీఆర్ కుటుంబంలో ఒకరు లిక్కర్ దందా, మరొకరు పేపర్ లీకేజీ దందాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు బండి సంజయ్ కు సంఘీభావం తెలిపేందుకే వచ్చాను.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణ కార్యకర్తలకు అండగా ఉన్నారు. పోలీసులకు నేను ఒక్కటే విజ్ఝప్తి చేస్తున్నా… కేసీఆర్ కుటుంబానికి గులాంగిరీ చేయకుండి. కేసీఆర్ పాలనకు బై బై చెప్పబోతున్నారు. ఎక్కడైతే బండి సంజయ్ ను అరెస్ట్ చూపారో… ఆ వరంగల్ నుండే నిరుద్యోగుల పక్షాన పోరాటం ప్రారంభించబోతున్నాం.లిక్కర్ దందా ఎవరు చేశారు? ఆ దందా కోసం ఎవరు ఢిల్లీ హోటల్ లో మంతనాలు జరిపారు? సుఖేష్ ఎవరికి నిధులిచ్చారు? లిక్కర్ క్వీన్ ఎవరు? మీ పాత్ర లేకుంటే ఎందుకు భయపడుతున్నారు? రాజ్యాంగం, న్యాయ స్థానం ముందు ఎవరూ అతీతులు కాదు. ఐపీసీ నుండి ఎవరూ తప్పించుకోలేరు.

మీరు యువరాజు, యువరాణి కావొచ్చు… తెలంగాణ ప్రజలే యజమానులు. రోజుకో లీడర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్లు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. రేవంత్ రెడ్డి తొలుత తన ఇంటిని(పార్టీని) చక్కదిద్దుకుంటే బెటర్… కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా రోజుకో లీడర్ కాంగ్రెస్ ను వదిలి వెళ్లిపోతున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టేదాకా నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ విశ్రమించబోదు. కేసీఆర్ కుటుంబానికి కేంద్రం చేసిన అభివృద్ధి కన్పించడం లేదు. ఇటలీ కళ్లద్దాలతో చూస్తున్నారు. గత 9 ఏళ్లలో దేశ అభివ్రుద్ధికి, తెలంగాణ ప్రగతి కోసం జరిగిన అభివ్రుద్దిని మీడియా అయినా చూపించాలి. తెలంగాణకు కేంద్రం చేసిన అభివృద్దిపై కేసీఆర్ తో బండి సంజయ్ బహిరంగ సవాల్ కు సిద్ధంగా ఉన్నారు. దమ్ముంటే చర్చకు రావాలి.

LEAVE A RESPONSE