* 9వ తేదీ నాడు రవీంద్రభారతి లో జరిగే వేడుకలకు మరియు 2025 సంవత్సరం యొక్క RTI విజేతలకు బహుమతులు అందజేయనున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
* నూతన కమిషన్ బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు అవుతుంది.
* గత 30 నెలలుగా నిర్వీర్యం అయిన శాఖ కు కొత్త ఉత్సాహం నింపిన నూతన సమాచార హక్కు కమిషనర్లు.
కమిషన్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పర్యటనచేసి తక్కువ పెండింగ్ కేసులు వున్నాయి అని గమనించి దీనికి కారణం కేవలం ప్రజల్లో సమాచార హక్కు చట్టం యొక్క ప్రాధాన్యత, అవగాహన లేకపోవడం లేదా ఆ జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా చట్టం ను అమలుపరచడం అని నమ్మి ఇట్టి జిల్లాలో PIO లు మరియు ప్రజలతో కలిసి సమాచార హక్కు చట్టం పై అవగహన సదస్సులు నిర్వహించడం మరియు అదే జిల్లాలో పెండింగ్ లో వున్న కేసులు విచారణ జరపడం జరిగింది.
కమిషన్ ఇప్పటివరకు అవగాహనా సదస్సులు మరియు విచారణ జరిపిన జిల్లాలు:- జనగామ, కామారెడ్డి, మెదక్, నిర్మల్, వనపర్తి, వరంగల్, జోగులాంబ గద్వాల్, వికారాబాద్, సిద్దిపేట, మహబూబాబాద్ మొదలైన జిల్లాలు.
గడిచిన 11 సంవత్సరాలనుండి కూడా పెండింగ్ లో వున్న కేసులు కూడా కమిషన్ దృష్టికి వచ్చాయి. వీటిని వీలు అయినంతవరకు విచారణ జరిపి ఆ కేసులని పరిష్కరించే చర్యలు చేపట్టారు .
కమిషన్ లో డిపార్ట్మెంట్ వారీగా తక్కువ లేదా మోస్తారు కేసులు వున్న డిపార్ట్మెంట్లు ముందుగా పరిష్కరించాలని నిర్ణయించి దాదాపు 12 శాఖలని ప్రక్షాళన చేసింది కమిషన్.
శాఖల వివరాలు:- పశు సంపద, బీసీ వెల్ఫేర్, ఫుడ్ & సివిల్ సప్లై, హౌసింగ్, ఇండస్ట్రీస్ & ఐ టి, లేబర్ & ఎంప్లాయిమెంట్, ప్లానింగ్, సోషల్ వెల్ఫేర్, ఉమెన్ & చైల్డ్ డెవలప్మెంట్, యూత్ అడ్వాన్స్మెంట్, ఎండోమెంట్స్ మొదలైనవి.
* నూతన కమిషన్ ఏర్పాటు అయిన తరువాత జరిగిన ముఖ్య కార్యక్రమాలు:
* 1. MCRHRD లో వారం పాటు నూతన కమిషనర్లలకు ట్రైనింగ్.
* 2. దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన నేషనల్ ఫెడరేషన్ అఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ద్వారా నిర్వహించిన వర్కుషాపులో పాల్గొనడం
* 3. జిల్లా మరియు ప్రభుత్వ శాఖల వారీగా నోడల్ ఆఫీసర్ల నియామకం.
* రాష్ట్ర గవర్నర్ గారిచే కమిషన్ తరపున అందుకోనున్న పురస్కారాలు :-
1. బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ అవార్డు
2. బెస్ట్ పెర్ఫార్మింగ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO) అవార్డు
3. బెస్ట్ పెర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్ ఇన్ డీస్ పోసల్ అఫ్ RTI కేసెస్ అవార్డు
4. బెస్ట్ వాలంటరీ డీస్ క్లోజర్ అఫ్ ఇన్ఫర్మేషన్ అండర్ సెక్షన్ 4(1) బి అఫ్ RTI యాక్ట్ అవార్డు
5. బెస్ట్ పెరఫార్మెన్స్ అఫ్ ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ అవార్డు
6. బెస్ట్ పెర్ఫార్మింగ్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అవార్డు
7. బెస్ట్ ఎంప్లొయ్ of TGIC