Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా తొలి రోజు 360 మంది కోవిడ్ రోగుల‌కు టెలిమెడిసిన్ స‌హాయం

రేప‌టి నుంచి 1000 మంది కి వైద్య స‌హాయం అందించేందుకు ఏర్పాట్లు

అమ‌రావ‌తి: కోవిడ్ బాధితుల‌కు ఆన్ లైన్ లో ఉచిత వైద్య సేవ‌ల ప్ర‌క్రియ‌ను ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ప్రారంభించింది. తొలి రోజు 360 మంది కోవిడ్ బాధితుల‌కు జూమ్ కాల్ ద్వారా డాక్ట‌ర్లు వైద్య స‌హాయం అందించారు. తొలి రోజు రెండు గంట‌ల పాటు జ‌రిగిన జూమ్ మీటింగ్ ద్వారా బాధితులు డాక్ట‌ర్ల నుంచి ప‌లు సూచ‌న‌లు పొందారు. రోగుల ఆరోగ్య ప‌రిస్థితి, ల‌క్ష‌ణాలు ఆధారంగా డాక్ట‌ర్లు మందులు సూచించారు. కొంద‌రు రోగుల‌కు వివిధ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. వైద్య సేవ‌ల‌తో పాటు పలు చోట్ల రోగుల‌కు మందులు పంపిణీ చేశారు. కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న‌ కార‌ణంగా….. రేప‌టి నుంచి రోజుకు 1000 మందికి టెలిమెడిసిన్ ద్వారా వైద్య సాయం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తెలుగు దేశం పార్టీ వ‌ర్గాల ద్వారా జూమ్ కాన్ఫ‌రెన్స్ ను లింక్ ను ప్ర‌జ‌ల‌కు అందేలా ఏర్పాట్లు చేశారు. రోజూ ఉద‌యం 7.30 గంట‌ల నుంచి టెలిమెడిసిన్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంది.

ఎన్టీఆర్ ట్ర‌స్ట్ సేవ‌లకు కొంద‌రు త‌మ వంతు తోడ్పాటు అందిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ వైద్య విభాగం అధ్య‌క్షులు జెడ్ శివ‌ప్ర‌సాద్ 5 వేల మందికి మందులు అందించేందుకు ముందుకు వ‌చ్చారు. తొలి రోజు కోవిడ్ రోగుల‌కు అందిన స‌హాయంపై ట్ర‌స్ట్ మేనేజింగ్ ట్ర‌స్టీ నారా భువ‌నేశ్వ‌రి రివ్యూ చేశారు. అద‌నంగా డాక్ట‌ర్లు, సిబ్బందిని నియ‌మించుకుని ఎక్కువ మంది రోగుల‌కు స‌హాయ ప‌డేలా ప్ర‌ణాళిక సిద్దం చేసిన‌ట్లు ఆమె ప్ర‌క‌టించారు.

LEAVE A RESPONSE