Suryaa.co.in

Andhra Pradesh

వై.ఎస్.విజయమ్మ ఓదార్పు యాత్ర… షర్మిల పాదయాత్రలు ఎందుకు జరిగాయో ఎవర్ని మోసగించడానికి జరిగాయో చెప్పు అంబటి

• భువనేశ్వరి ప్రజల్లోకి వస్తోందనగానే ముఖ్యమంత్రికి, మంత్రులకు మతి చలించింది
• చంద్రబాబు కుటుంబానికి సమాధానం చెప్పలేక, ఆయన తప్పు చేశాడని కోర్టుల్లో నిరూపించలేక… ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో తెలియని స్థితిలో ముఖ్యమంత్రి, మంత్రులు పిచ్చికూతలు కూస్తున్నారు
• వై.ఎస్ మరణంపై కలత చెంది ఎవరూ చనిపోలేదని.. కేవలం తన ప్రయోజనాలకోసం జగన్మోహన్ రెడ్డి ఆనాడు అబద్ధం చెప్పాడన్నది అంబటి రాంబాబు అభిప్రాయమా?
• గతంలో జగన్ తల్లి విజయమ్మ సానుభూతి కోసమే ఓదార్పు యాత్ర చేసిందా అంబటి?
• జగన్ వదలిన బాణాన్నంటూ ప్రజల్లోకి వెళ్లిన షర్మిల ఏ ప్రయోజనాలు ఆశించి పాద యాత్ర చేసింది రాంబాబు?
• సొంత బాబాయ్ ని చంపిన వాడిని కాపాడినప్పుడే జగన్ వ్యక్తిత్వం ఏంటో జనాలకు అర్థమైంది అంబటి
• అధికారం తలకెక్కి, అహంకారంతో మాట్లాడే మంత్రులకు మొసళ్ల పండగ ముందుంది
– మాజీ మంత్రి పీతల సుజాత

అభివృద్ధి, సంక్షేమం తప్ప మరేమీ పట్టని మచ్చలేని నాయకుడు.. ప్రజల సుఖ సంతో షాల గురించి ఆలోచించే నిస్వార్థ నాయకుడైన చంద్రబాబు నాయుడిని అన్యాయంగా జైలుకు పంపిన జగన్మోహన్ రెడ్డి , అతని ప్రభుత్వం నిత్యం టీడీపీ అధినేతపై దుష్ప్రచారం చేస్తూ, వెర్రిమొర్రి ఆనందం పొందుతోందని మాజీ మంత్రి పీతల సుజాత తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …

“చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబం గురించి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు నోటికి అడ్డు, అదుపు లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు సతీమ ణి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లడాన్ని తప్పుపడుతున్న మంత్రి అంబటి రాంబాబు.. గతంలో వై.ఎస్.విజయమ్మ ఎందుకు ఓదార్పు యాత్ర చేసిందో, జగన్ వదిలిన బాణా న్ని అంటూ ఆయన చెల్లి షర్మిల ఎందుకు పాదయాత్ర చేసిందో సమాధానం చెప్పాలి.

వై.ఎస్.మరణంతో ఎన్నో గుండెలు ఆగిపోయాయంటూ విజయమ్మ చేసిన యాత్ర అంతా బూటకమని రాంబాబు ఉద్దేశమా? వై.ఎస్ చనిపోయినప్పుడు ఆయనపై అభి మానంతో ప్రజలు ఎవరూ చనిపోలేదని.. కేవలం తన ప్రయోజనాలకోసం జగన్మోహన్ రెడ్డి ఆనాడు అబద్ధం చెప్పాడన్నది అంబటి రాంబాబు అభిప్రాయమా? అధికారంలో ఉన్నామన్న అహంకారంతో గతం, వర్తమానం మరిచి మాట్లాడితే, దానికి రెట్టింపు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే వాస్తవాన్ని మంత్రి అంబటి గ్రహించాలి.

గతంలో జగన్ తల్లి విజయమ్మ సానుభూతి కోసమే ఓదార్పు యాత్ర చేసిందా అంబటి? జగన్ వదలిన బాణాన్నంటూ ప్రజల్లోకి వెళ్లిన షర్మిల ఏ ప్రయోజనాలు ఆశించి పాద యాత్ర చేసింది రాంబాబు?
చంద్రబాబు ఆరోగ్యంతో ఆయన కుటుంసభ్యులు, టీడీపీనేతలే అబద్ధాలాడుతూ, సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారంటున్న అంబటి… గతంలో జగన్ కూడా అలానే చేశాడన్న ఆలోచనతోనే అలా మాట్లాడారా? సానుభూతి కోసం పాకులాడి… ప్రజల్ని తమ స్వార్థానికి వాడుకోవడం వైసీపీనేతలకు, ముఖ్యమంత్రికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డిని కాపాడటంకోసం ఆయన తల్లిని అడ్డం పెట్టి రాజకీయాలు చేయలేదా?

అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సీబీఐ వారికి పోలీసుల్ని అడ్డు పెట్టి, కేంద్యదర్యాప్తు సంస్థ అధికారుల్ని భయభ్రాంతులకు గురిచేయలేదా? 16 నెలలు తాను జైల్లో ఉన్నాడు కాబట్టి.. జగన్ ఏదోరకంగా చంద్రబాబుని జైలుకు పంపాలని కుట్రలకు పాల్పడి, రాజ్యాంగవ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని తాను అనుకున్నది చేయగలిగాడు.

జగన్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలను సమర్థిస్తున్న అంబటి రాంబాబు లాంటి మంత్రులకు, వైసీపీనేతలకు మొసళ్ల పండగ ముందుంది. లక్షలకోట్ల ప్రజల సొమ్ము దోచేసిన జగన్మోహన్ రెడ్డి పెద్ద గజదొంగ అయితే, అంబటి లాంటి మంత్రులు చిల్లరదొంగలు. తమకు అంటిన అవినీతి మరకల్ని చంద్రబాబుకి అంటించాలని జగన్ రెడ్డి అండ్ కో తాపత్రయపడుతున్నారు.

వైసీపీకి, జగన్ రెడ్డికి భవిష్యత్ లేదని మంత్రులకు అర్థమయ్యే, చంద్రబాబు కుటుంబ సభ్యులపై పడి ఏడుస్తున్నారు
వైసీపీకి, జగన్ రెడ్డికి ఇక భవిష్యత్ లేదని గ్రహించే జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం మొత్తం చంద్రబాబు కుటుంబాన్ని మానసికంగా దెబ్బతీయాలన్న దురాలోచనతో ఆడవాళ్లను కూడా అవహేళన చేస్తూ వారిపై పడి ఏడుస్తున్నారు. ఇంటినుంచి కూడా బయటకు రాని భువ నేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించి రాక్షసానందం పొందారు. తన కుటుంబసభ్యుల నుంచి తాను ప్రాణాలతో బయటపడిన అనుభవం గతంలో నారాయణస్వామి చవి చూసినందునే …భువనేశ్వరిపై నిందలేశాడా?

చంద్రబాబు ఆరోగ్యంపై సమాధానం చెప్పకుండా వైద్యపరీక్షల నివేదికలు బయటపెట్టకుండా మంత్రులు, ముఖ్యమంత్రి అసందర్ధ ప్రేలాపనలు చేస్తూ, శునకానందం పొందు తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబసభ్యులతో పాటు, ప్రజలంతా తీవ్రంగా తల్లడిల్లిపోతుంటే, జగన్ రెడ్డి, మంత్రులు, వైసీపీనేతలు మాత్రం భుజాలు ఎగరేస్తూ పిచ్చిఆనందం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డిపై 38 కేసులున్నాయి.

ఆయన రూ.43వేలకోట్లు అవినీతి చేసినట్టు సీబీఐ, ఈడీ నిగ్గుతేల్చబట్టే 16 నెలలు జైల్లో ఉన్నాడు. చంద్రబాబు తప్పు చేశాడని 40 రోజుల్లో ఒక్క ఆధారం కూడా చూపించలేని జగన్.. చివరకు తనకు తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరిగిందంటూ కట్టుకథలు చెబుతున్నాడు. చంద్రబాబుని అన్యా యంగా జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపాడని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది.
చంద్రబాబుని జైలుకు పంపితే, ఆయన కుటుంబసభ్యులు బయటకు వచ్చారని జగన్ వణికిపోతున్నాడు తన భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే అన్యాయంగా ఆడవాళ్లని కూడా లేకుండా తన మంత్రులతో నిందలేయిస్తున్నాడు

సొంత బాబాయ్ ను తన అధికారంకోసం చంపించినందుకు, దళిత యువకుడిన చంపి, అతని శవాన్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ల భుజాలపై చేతులేసి తిరుగుతున్నందుకు, తప్పుల మీద తప్పులు చేస్తూ, నేరాలు ఘోరాలకు పాల్పడుతూ సిగ్గులేకుండా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగుతున్నందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి.

తప్పులు చేసి, నేరాలుఘోరాలకు పాల్పడేవారికి లేని భయం..బిడియం.. ఏ తప్పూ చేయని వారికి ఎందుకుంటాయి? ప్రజలు జగన్ కుట్రలు..కుతంత్రాలు గ్రహించి భువనేశ్వరికి మద్ధతు తెలుపుతున్నారనే వారిని బయటకు రానీయకుండా జగన్ అడ్డుకుం టున్నాడు. చంద్రబాబుకు భయపడి ఆయన్ని జైలుకు పంపితే, ఇప్పుడు ఆయన కుటుంబసభ్యులు బయటకువచ్చి తనకు నిద్రలేకుండా చేస్తున్నారని జగన్ వణికి పోతున్నాడు. ముఖ్యమంత్రి, మంత్రులు చంద్రబాబు పై, ఆయన కుటుంబంపై ఎన్ని నిందలేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు.” అని పీతలసుజాత స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE