Suryaa.co.in

Telangana

అది నోరా.. ఇంకేమయినానా ?

రాహుల్ ప్రసంగం చూసి అందరూ నవ్వుకుంటున్నారు
ఏ గ్యారంటీ ల్లో లేకున్నా పీసీసీ అధ్యక్షుడు తులం బంగారం ఇస్తామంటున్నాడు
దేశమంతా ఉచిత కరెంటు ఇస్తామని దమ్ముంటే కాంగ్రెస్ చెప్పాలి
కాంగ్రెస్ ది శునకానందం
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రాహుల్ గాంధీ అసంబద్ధంగా మాట్లాడారు.తెలిసో తెలియక అబద్దాలు మాట్లాడారు.లక్ష కోట్లు ఖర్చు కాని కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదం.

రాహుల్ కుటుంబ పాలన గురించి అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరం.బోఫోర్స్ స్కాం తో రాజీవ్ గాంధీ అధికారం కోల్పోయిన విషయం మరిచారా?రాహుల్ ప్రసంగం చూసి అందరూ నవ్వుకుంటున్నారు.కనీస సమాచారం లేకుండా రుణ మాఫీ జరగలేదని రాహుల్ గాంధీ అంటున్నారు. 23 లక్షల మంది కి ఈ దఫా లో 13 వేల కోట్ల రూపాయలు మాఫీ అయ్యాయి.

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు కర్ణాటక లో తునాతునకలు అయ్యాయి. వ్యవసాయానికి ఐదు గంటలకు కరెంటు కు మించి ఇవ్వలేమని కర్ణాటక మంత్రి అంటున్నారు.కర్ణాటక లో అమలు గానీ గ్యారంటీలు ఇక్కడ అమలవుతాయా?రైతు వ్యతిరేక చట్టాలు కాంగ్రెస్ చలవే.

తెలంగాణ వడ్లు కొనమని కేంద్రం చెప్పినపుడు రాహుల్ నోరు మెదపారా ?రైతు వ్యతిరేక చట్టాల పై రాహుల్ పార్లమెంటు లో ఎందుకు మాట్లాడలేదు ?రాహుల్ తన మీద కేసుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉద్యమం లో చాలా మంది మీద కేసులు ఉన్నాయి.

ఏ గ్యారంటీ ల్లో లేకున్నా పీసీసీ అధ్యక్షుడు తులం బంగారం ఇస్తామంటున్నాడు. అది నోరా ఇంకేమయినానా ? ప్రజలు కేసీఆర్ మీద ఎందుకు విసుగు తెచ్చుకుంటారు ? దేశం లో ఎక్కడలేని సంక్షేమం అమలవుతున్నందుకు విసుక్కుంటారా? కాంగ్రెస్ మీద ప్రజలకు విసుగు ఉంది.అపుడు కాంగ్రెస్ పాలన లో చేసిన పాపాలను ప్రజలు మరచిపోవడం లేదు.బీ ఆర్ ఎస్ బీజేపీ ఒక్కటేనని దుష్పచారం చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ లు కుమ్స్కయ్యాయి ..సిగ్గు లేకుండా మమ్మల్ని విమర్శిస్తున్నారు.కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చామని ఇంకెన్ని సార్లు చెప్పుకుంటుంది. రాహుల్ ఎన్ని సార్లు వచ్చినా అధికారం లోకి వచ్చేది బీ ఆర్ యెస్ యే.

రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. దేశమంతా ఉచిత కరెంటు ఇస్తామని దమ్ముంటే కాంగ్రెస్ చెప్పాలి.కాంగ్రెస్ ది జాతీయ పార్టీ కాదా ..వ్యవసాయం మీద ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉంటుందా?కాంగ్రెస్ ది శునకానందం. రాష్ట్రంలో కాంగ్రేస్ వచ్చే పరిస్థితి లేదు.

LEAVE A RESPONSE