రామచంద్రపురం: తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగరవేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ . స్వర్గీయ ఎన్టీఆర్చే తుల మీదుగా పార్టీ ఆవిర్భవించి, దార్షికనేత, స్వర్ణాంధ్ర రథసారథి, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో తీర్చుదిద్దుకుని జాతీయస్థాయిలో విరాజిల్లుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు మంత్రి సుభాష్ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. పలువురు పార్టీ సీనియర్ నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.