Suryaa.co.in

Andhra Pradesh

సనాతన ధర్మంపై తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చులకన

– కన్నప్ప సినిమాపై సనాతన ధార్మిక వాదులు ఆగ్రహం…
– సెన్సార్ బోర్డు రీజనల్ అధికారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసు
– కేసు హైకోర్టులో పెండింగ్లో ఉండగా కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా చేస్తారు?
– బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ

అమరావతి: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సనాతన ధర్మం పట్ల చులకన, హేళన, అవమానపరిచే భావనతో పనిచేస్తుందని, దీనికి ఎన్నో సినిమాలు ఉదాహరణగా ఉన్నాయని, ఎందుకు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు సనాతన ధర్మాలను కించపరిచే సన్నివేశాలు పెడుతుంటే ఎందుకు నోరు మెదపటలేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి చలనచిత్ర పరిశ్రమను ప్రశ్నించారు.

మంచు మోహన్ బాబు, విష్ణు చలనచిత్ర పరిశ్రమలో అరాచకాలు సనాతన ధర్మన్నీ కించపరిచే సన్నివేశాలు, బ్రాహ్మణ కులాన్ని అవహేళన చేస్తూ అవమానిస్తూ చిత్రాల నిర్మిస్తుంటే సినీ పరిశ్రమ పెద్దలు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని, ఈ సినిమాలపై కోర్టులు మొట్టికాయలు వేసినసరే చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ సిగ్గు వస్తుందని శ్రీధర్ ప్రశ్నించారు.

గత వారం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లు సినిమాపై సినీ ఇండస్ట్రీలో కొన్ని వర్గాల పెద్దలు వివాదం చేశారని, అదే పెద్దలు కన్నప్ప సినిమాపై ఎందుకు వివాదం చేయలేకపోతున్నారని శ్రీధర్ ప్రశ్నించారు.సనాతన ధర్మాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్న పవన కళ్యాణ్ ను అవమానించాలని సినీ రంగ పెద్దలు వివాదం చేశారా? అని శ్రీధర్ ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చులకన,హేళన భావంతో ఉన్నట్లుగా భావిస్తున్నట్లు శ్రీధర్ తెలియజేశారు.

కన్నప్ప సినిమాలో పిలక గిలక అనే పాత్రలు పెట్టి సనాతన సాంప్రదాయాన్ని అవమానించుతున్నారని, పిలక అంటే శిఖ పేరుతో పురాణ ఇతిహాసాలు దానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, దేవతలకు కూడా శిఖ ఉంటుందని దాన్ని ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణులు ధరిస్తున్నారని దాన్ని సినిమాలో హాస్య పాత్రల కోసం వాడుకోవడం క్షమించరానిదని అన్నారు.

ఈ పాత్రలపై గత నవంబర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాము రిట్ పిటిషన్ 6236/2025 గా దాఖలు చేశామని, దానిలో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వారిని, కేంద్ర చలనచిత్ర పరిశ్రమ శాఖను, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, కన్నెగంటి బ్రహ్మానందం, సప్తగిరి వీరిని ప్రతివాదులుగా చేర్చటం జరిగిందని, దీనిపై హైకోర్టులో కౌంటర్ పడేయకుండా మోహన్ బాబు కుటుంబం సినీ ప్రొడక్షన్ యూనిట్ నాటకాలు ఆడుతున్నారని అన్నారు.

కేంద్ర సినీ శాఖ అధికారులు మాత్రం తమ వాదన వినిపిస్తున్నారని, సెన్సార్ బోర్డు రీజనల్ అధికారి ఈ సినిమా పై చర్యలు తీసుకోకపోతే భారతీయ చలనచిత్ర చట్టం ప్రకారం ఆ అధికారిపై క్రిమినల్ కేసులు బనాయిస్తామని శ్రీధర్ హెచ్చరించారు. ఈ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉండగా కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా చేస్తారని శ్రీధర్ ప్రశ్నించారు. ఈ జెడ్పిటిషన్ దాఖలు చేశామని కక్షతో గుంటూరులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం మంచు మోహన్ బాబు కుటుంబం ఏర్పాటు చేసిందని అన్నారు.

దాని సందర్భంగా గుంటూరులో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, అర్చక పురోహిత బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో తాము శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించామని నాయకులు తెలియజేశారు. శివయ్యకు అపచారం – తిన్నడికి అన్యాయం పేరుతో గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో శివలింగాన్ని ఏర్పాటు చేసి దానికి ఏకరుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం పోలీస్ అధికారుల బందోబస్తు మధ్యలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధార్మిక వాదులు దర్శనపు శ్రీనివాస్, బృందావనం గోపి, పెద్దింటి ఫణి రాజేంద్రకుమార్, పెద్దింటి కృష్ణ చైతన్య, తుళ్లూరు ప్రకాష్, కొప్పర్తి సీతారమేష్, పి. భావనారాయణ, పొత్తూరి మహేష్, నల్గొండ రాధా కృష్ణమూర్తి, పెమ్మరాజు సుధాకర్, వడ్డమాను ప్రసాదు, చిలుమూరు ఫణి, ఐలూరు శ్రీనివాసరావు, లలిత సంపత్ కుమార్, పార్వతి,వి. హరనాథ్, కిషోర్ శర్మ, చందు, ప్రత్తిపాటి కాళీ పవన్, వలివేటి వినోద్ కుమార్, చదలవాడ వినయ్, తాడికొండ పవన్ కుమార్, వడ్లమూడి రాజా, వి. నాగేశ్వరరావు అర్చక, పురోహిత, బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE