– సర్కారుపై నమ్మకం కలిగేలా పనిచేయండి
– వన్‌టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు
– మార్పు రావాలి
– జూన్ 12వ తేదీన అమరావతిలో 2 వేలమందితో కార్యక్రమం
అమరావతి కేబినెట్ లో మార్పులు చేర్పులు తప్పవనే వాదన వినిపిస్తోంది. వైసీపీ లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఏడాదిలో ఎమ్మెల్యేల పని తీరు.. అవినీతి ఆరోపణల వేళ చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేశారు. ఒన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమిపై ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని.. ఎమ్మెల్యేలు అందరూ అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని, ఎమ్మెల్యేలు గుర్తించాలని హెచ్చరించారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని వార్నింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్నిపెంచే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించాలని నిర్దేశించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా.. జూన్ 12వ తేదీన అమరావతిలో 2 వేలమందితో ఓ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.