Suryaa.co.in

Andhra Pradesh

నోరు మెదపని తెలుగు హిందువులు గొప్పోళ్ళు

– ఆంధ్రప్రదేశ్ లో గుడి-వ్యాపారం బాగుంది

శ్రీశైలం లో ఒకప్పుడు శివ లింగాన్ని తాకి, అభిషేకం చేయాలి అంటే ఫ్రీ. ఇది నేను చూసాను.
ఆ తర్వాత 100 రూపాయలు పెట్టారు. ఇదీ చూసాను.
ఆ తర్వాత కాంగ్రెస్ మహానుభావులు 1116 చేశారు.
ఇక ఇప్పుడు 5000 చేశారు.
అయినా హిందువులు 5000 ఇచ్చి, గర్భాలయంలో అభిషేకం చేయిస్తారు తప్ప, “పేద వాడికి ఈ దేవుడు అందుబాటులో ఉండడా ?” అని ప్రశ్న వేయరు.
ఆంధ్రప్రదేశ్ లో గుడి-వ్యాపారం బాగుంది. ప్రభుత్వమే ఈ వ్యాపారం చేస్తుంది.

శ్రీశైలం లో దేవాలయానికి మొదటగా దిక్కు ఉన్నది అక్కడి చెంచులు, ఆటవికులు. వారినైనా ఫ్రీగా గర్భాలయం లోకి రానిస్తారా లేదా ? ఆలయాన్ని విస్తరించి, అద్భుతంగా తీర్చిదిద్దిన రెడ్డి రాజులకు కూడా పాపం తెలివి లేదు…ఉంటే, ఇలా 5000 Rs టిక్కేట్ పెడతారని తెలిసుంటే…గుడిని డెవలప్ చేసేవారు కాదేమో.

ఈ విషయంలో మన ప్రభుత్వానికి జేజేలు చెప్పాల్సిందే!
ఏ పార్టీ వారున్నా, ఉత్తరప్రదేశ్ ను పాలించిన పార్టీలకు తెలివి లేదు. ఎందుకంటే… కాశీలో ఇప్పటికీ ఫ్రీగా శివలింగానికి…భక్తులే గంగ నీరు తెచ్చి అభిషేకం చెయొచ్చు. మన పెబుత్వాలను అక్కడ వేస్తే నాసామిరంగా… దెబ్బకు గుడి అంటే పారిపోయేలా చేస్తారు.

గ్రామాలలో గుళ్లలో దేవుడికి దీపం పెట్టే పూజారులు డబ్బులేక అవస్థలు పడుతుంటారు. ఏ మహానుభావుడో ఓ 500 ఇస్తే చాలు, వారం హాయిగా బతకొచ్చని వెర్రి చూపూలు చూస్తుంటాడు. రారు, ఇవ్వరు. గ్రామాల్లోని పురాతన గుళ్ళు శిథిలం అవుతుంటాయి. డబ్బురాని , సెంటిమెంట్ వర్క-ఔట్ అవని గుళ్లను ప్రభుత్వాలు లైట్ తీసుకుంటాయి. తమ ఆధీనంలోని గుళ్లలో టికెట్లతో, హుండీలతో భక్తులను పిండుతాయి. కోట్లు, కోట్లు డబ్బు దండుకుని… ఏనాడు ఫ్రీగా ఒక భగవద్గీత పుస్తకం కూడా భక్తులకు పంచిపెట్టవు.

ఎంతైనా… నోరు మెదపని తెలుగు హిందువులు గొప్పోళ్ళు కదూ. తప్పులు చూపిస్తే… నువ్వు ఫలానా పార్టీ అంటారు…ఫలానా కులం అంటారు….

LEAVE A RESPONSE