ఈ జాయిన్ అయ్యే నాయకులు ఏదో ఎలక్షన్స్ కి ముందు జాయిన్ అయితే కొంచెం బాగుండేది…
మొన్న స్పీకర్ అయ్యన్న ను ఓడించటానికి సర్వశక్తులు తో పోరాడిన అడారి ఇప్పుడు జాయిన్ చేయించుకున్నారు కూటమి లో. కులం కులం అనేసి లోకేష్ ఓటమి కోసం అహర్నిశలు కష్టపడ్డ గంజి చిరంజీవి ఈ రోజు కూటమి లో జాయిన్ అయ్యారు
ఒక్కటి మాత్రం నిజం…
రాజకీయాలు చాలా మలినం అయిపోయాయి రోజు రోజు కి…
ఆంధ్ర మొత్తం విభజన తో మోసపోతే అప్పటి కాంగ్రెస్ నాయకులూ జీవితాలు నాశనం అయిపోయాయి అనుకున్నాము. కానీ వాళ్ళు అందరు వైస్సార్సీపీ లో చేరి పోయి MLA , మినిస్టర్ అయి పోయారు…కట్ చేస్తే నష్టపోయింది ప్రజలు.
గత ఐదు ఏళ్లలో వైస్సార్సీపీ చేసిన అరాచకాలకు జనం విసుగు చెంది 164 సీట్స్ లతో వన్ సైడ్ విక్టరీ ఇస్తే…ఆ అరాచకాలకు ఆద్యులు అయినా నాయకులు అందరు ఇప్పుడు చక్కగా ఎదో ఒక పార్టీ మారిపోతున్నారు… చేర్చుకునే వాళ్ళు ఉన్నంత వరకు ఈ రాజకీయ వికృత క్రీడ లో ఓడిపోయేది ప్రజలు..నమ్ముకున్న కార్యకర్తలు మాత్రమే….
శబాష్ ఆంధ్రులారా.. అంధులారా…ఎస్..అంధులారా….తప్పు లేదు.
– రమేష్