-ప్రవాసభారతీయుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-అమెరికాలోని 40 నగరాల్లో.. భారీగా హాజరైన అభిమానులు
-జూమ్ యాప్ ద్వారా ప్రవాసభారతీయులతో మమేకమైన రాష్ట్ర స్థాయి నేతలు
అమెరికా/ డెట్రాయిట్: గడచిన 4 దశాబ్ధాల కాలంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని మాత్రమే కాంక్షించిందని డైట్రాయిట్ తెలుగుదేశం
కౌన్సిల్ మెంబర్స్ పేర్కొన్నారు. ఎన్నారై తెలుగుదేశం అమెరికా విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని అమెరికా వ్యాప్తంగా 40 నగరాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా డెట్రాయిట్‌లోని రావుగారు విందు రెస్టారెంట్‌లో డైట్రాయిట్ తెలుగుదేశం కౌన్సిల్ మెంబర్స్ సురేష్ పుట్టగుంట, కిరణ్ దుగ్గిరాల, దంతేశ్వర్‌రావ్, మనోరమ గొంది, సీత కావూరి, ఉమామహేశ్వరరావు ఓమ్మి, జోగేశ్వరరావు పెద్దబోయిన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డైట్రాయిట్
తెలుగుదేశం కౌన్సిల్ మెంబర్స్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తరువాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు.
ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం
నిర్వహించిన తెదేపా ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నలభై ఏళ్ల క్రితం
ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో ఒక చారిత్రక అవసరంగా గుర్తింపు పొందిందని తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన జూమ్ యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెదేపా ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొని ప్రసంగించారు. జూమ్ యాప్‌లో రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తాడిపత్రి ఎమ్మెల్యే
తెనాలి శ్రావణకుమార్, తెదేపా అఫిషియల్ స్పోక్స్‌పర్సన్ గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లల్లో ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను
కొనియాడారు. చంద్రబాబును మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేందుకు అహర్నిశలు పాటుపడతామని గొంతెత్తి చాటారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రతి నాయకుడు తమ శక్తి మేరకు కృషి చేయాలని కోరారు.