– తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు
తెలుగుదేశం హయాంలో ఒక్క రూపాయి చార్జీ కూడా పెంచలేదు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి గాలి మాటలు చెబుతూ కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా విద్యుత్ ఛార్జీల భారం మోపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుంచి 31 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనాలి… పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది.
జగన్ రెడ్డి రెండున్నరేళ్లలో ప్రజలపై రూ. 36,102 కోట్ల విద్యుత్ భారం మోపారు. ఇప్పటికి ఆరుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.11,611 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పులు చేసి రూ.24,491 కోట్లు భారం మోపారు. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి మడమ తిప్పారు. జగన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలల అవినీతి, దుబారాకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. పెంచిన విద్యుత్ చార్జీలు, తెచ్చిన అప్పులు ఏనుగులు వెలగపండ్లు మింగినట్టు మింగేశారు.
అసలే కరోనా ప్రభావంతో అన్ని వర్గాల ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం ఆస్తిపన్ను, చెత్తపన్ను, నిత్యవసరాల పన్ను, పెట్రోల్, డీజిల్, నిత్యవసరాల ధరలు పెంచి బ్రతుకే భారంగా మార్చారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాడు బిగిస్తున్నారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గుతున్నా వినియోగదారులపై భారం మోపడం మాత్రం ఆగడం లేదు. కాబట్టి ప్రజలు తమ నిరసన ప్రభుత్వంకు అర్ధమయ్యేలా విసృత స్థాయిలో పాల్గొని జయపద్రం చేయాలి.