Suryaa.co.in

Telangana

CRO కార్యాలయం ఎదుట తెలుగుదేశం నిరసన ధర్నా

ఈ రోజు సికింద్రాబాద్ లోని ఛీఫ్ రేషనింగ్ అధికారి (CRO) కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. కార్యక్రమం సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షులు సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్  ముఖ్య అతిధిగా విచ్చేసారు. కార్యకర్తలు పెరిగిన పెట్రోల్, గ్యాస్, నిత్యావస వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం ఛీఫ్ రేషనింగ్ అధికారికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా సాయిబాబా మాట్లడుతూ… అధిక ధరలతో సామాన్య ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుంటే, ప్రజల గోడు పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రజలు ఏమైపోతే మాకేంటి అన్న విదంగా వ్యవహరిస్తుంది
tdp2 ప్రభుత్వం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం పేరుతో ఆడంబరాలు చేస్తూ, అధిక ధరలతో ప్రజలను ఇబ్బంది పెడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. విచ్చలవిడిగా ప్రభుత్వ ధనాన్ని కోట్లు ఖర్చు చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని ఆర్భాటాలు చేయడం ఎంతవరకు సమంజసమని సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షులు సాయిబాబా అన్నారు. పెరిగిన ధరల విషయంలో వెంటనే స్పందించి, అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడేంట్ నల్లెల్ల కిషోర్, ప్రధానకార్యదర్శులు బాలరాజ్ గౌడ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దోజు రవీంద్రాచారి, జివిజి నాయుడు, శ్రీనివాస్ నాయుడు,
Whats-App-Image-2022-04-27-at-6-38-49-PM అన్నపూర్ణ, ఆర్.భాస్కర్, ఓ.వెంకటేష్, కట్ట రాములు, జి.యాదగిరావు, పుప్పాల బాలకృష్ణ, ఎం.రాజు, భవాని శ్రీనివాస్, ఎన్.శరణ్, చంద్రమోహన్ గౌడ్, రబ్బాని, జి.మధుసూధన్, సిహెచ్.ప్రదీప్ గౌడ్, ఎం.నర్సింహా, శ్రీనివాస్ బాబా, జోగింధర్ సింగ్, గౌరి శంకర్ యాదవ్, నల్లా అనిల్, సత్యనారాయణ, బాను ప్రకాష్, కెడి. దినేష్, ఎస్.కె.బాబు, బిక్షపతి, శక్తిప్రేమ్, అన్నమ్మ, హేమలత, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE