– గుడి భూముల విషయంలో వీరికి ధైర్యం ఎక్కువ
– కానీ మసీదు భూములను మాత్రం ఒక్క ఎకరం కూడా తాకే ధైర్యం లేదు
– ఇదే వీరి సెక్యులరిజం
– జూబ్లీహిల్స్ కూడా ఓల్డ్ సిటీలా మారిపోతుంది
– సీతారాంపూర్ సీతారాముల స్వామి గుడికి చెందిన 1100 ఎకరాల ఎండోమెంట్స్ భూమిని దేవాదాయ శాఖకు అప్పగించాలి
– చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, సీతారాంపూర్ సీతారాముల స్వామి గుడికి చెందిన 1100 ఎకరాల ఎండోమెంట్స్ భూమిని ప్రభుత్వం నోటిఫై చేసి, వ్యాపారులకు అమ్మేసింది. ఇది పూర్తిగా అక్రమం. ఎండోమెంట్స్ భూమిని ప్రభుత్వం వేలం వేసి అమ్మడం చట్టవిరుద్ధం. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా చేసింది.
ఇప్పుటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిని తిరిగి దేవాదాయ శాఖకు అప్పగించాలి, రిజిస్ట్రేషన్ రద్దు చేసి పునరుద్ధరించాలి. కానీ అది కూడా చేయలేదు. అందువల్ల టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) మరియు కాంగ్రెస్.. రెండూ ఒకటే అని స్పష్టమవుతోంది.
మరోవైపు జూబ్లీహిల్స్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వ భూములు, డిఫెన్స్ భూములు కూడా తీసుకుని ఖబర్స్తాన్లకు ఇస్తోంది. గుడి భూములను మాత్రం కబ్జా చేసి అమ్మేస్తున్నారు. గుడి భూముల విషయంలో వీరికి ధైర్యం ఎక్కువ. కానీ మసీదు భూములను మాత్రం ఒక్క ఎకరం కూడా తాకే ధైర్యం లేదు. ఇదే వీరి “సెక్యులరిజం”!
ఇప్పుడు ఈ పని “అభివృద్ధి కోసం” అని చెప్పుకుంటున్నారు. కానీ ఇది అభివృద్ధి కాదు — దేవాలయ భూములపై దాడి. ఇప్పటికి ఖబర్స్తాన్కు ఇస్తున్నారు, రేపు మదర్సాలకు ఇస్తారు. ఇలా కొనసాగితే, జూబ్లీహిల్స్ కూడా ఓల్డ్ సిటీలా మారిపోతుంది. సాధారణ ప్రజలు అక్కడ నివసించలేని పరిస్థితి వస్తుంది.
అందుకే మేము ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ కాంగ్రెస్-ఎంఐఎం దుర్మార్గాలను, ఆగడాలను, మోసాలను, వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నాం. నిజమైన ప్రజల నమ్మకాన్ని సాధిస్తున్నాం. దీన్నే మేము “కార్పెట్ బాంబింగ్” అంటున్నాం.