– కేసీఆర్ నిర్ణయంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విస్మయం
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీ.వో.నెం.33 విడుదల చేసిన తీరు విస్మయానికి గురిచేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వాన్ని చూపాయి. ఇందిరా సహానా కేసు విషయంలో కూడ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు అని అనలేదు. కొన్ని ప్రత్యేక పరిస్ధితులలో రాష్ట్రాల పరిధిలో ఆ పరిధిని మించి రిజర్వేషన్లు కల్పించవచ్చు అని ఉంది.
ప్రస్తుతం దేశంలో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం వారికి ఏడున్నర శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. దీని ప్రకారం రాష్ట్రాలలో కూడ వారి జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనుల రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 (4) A ప్రకారం రాష్ట్ర పరిధిలో విద్యా, ఉపాధి అవకాశాల విషయంలో స్ధానిక జనాభాకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించుకోవచ్చు.ఈ విషయమై శాసనసభలో 2017 ఎప్రియల్ లో కూడ నేను ప్రస్తావించడం జరిగింది. ఈ విషయమై న్యాయ నిపుణులను చట్ట సభలకి పిలిపించి వివరణ కోరాల్సిందిగా కోరడం జరిగింది. కాని ఆ విధంగా చేయలేదు.
కాని నాడు నేను పెర్కౌన్న అంశాలకు అనుగుణంగానే ఈ రోజు జీ.వో.నెం.33 విడుదల కాబడింది. అంటే 2017 లోనే వారికి రిజర్వేషన్లను కల్పిస్తూ నిర్ణయాన్ని తీసుకునే ఉంటే 5 సంవత్సరాల క్రితం నుండే 10 శాతం మేర గిరిజనలకు రిజర్వేషన్లు అమలు అయ్యి ఉండేవి.కాని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వాల తాత్సర్యం కారణంగా గత ఐదున్నర సంవత్సరాల నుండి రాష్ట్రంలో 4 శాతం చొప్పున గిరిజనులు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను కోల్పోతూ వచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్లు అమలయ్యేవి. ఆనాడు మొత్తం జనాభాలో 10 శాతం గిరిజనులు తెలంగాణ ప్రాంతలోనే ఉన్నారు. ఈ కారణంగా 4 శాతం మేర రిజర్వేషన్లను తెలంగాణ ప్రాంతంలోని గిరిజనులు నష్టపోయారు. తెలంగాణ రాష్టాన్ని సాధించుకున్న తరువాత కూడ రిజర్వేషన్ల విషయంలో వారి తలరాతలు నేటి వరకు మారలేదు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత కూడ 10 శాతం మేర గిరిజనులకు విద్యా, ఉపాధి అవకాశాల విషయంలో అమలు కావల్సిన రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం.. అలసత్వం కారణంగా గిరిజనులు నష్టపోయారు. ఈ కారణంగా గత ఐదున్నర సంవత్సరాల కాలంలో 1000 మందికి పైగా గిరిజన విద్యార్ధులు డాక్టర్ కోర్సులను చదవే అవకాశం కోల్పోయారు. అంతేకాక ఉద్యోగ అవకాశాలను కూడ కోల్పోయారు. ఈ ఆలసత్వానికి కారణమైన ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారు తన పదవిలో ఉండే నైతిక హక్కును కోల్పోయారు.
ఇప్పుడు మాత్రం నాటకీయంగా జీ.వో.నెం.33 ను విడుదల చేశారు. కాబట్టి గత ఐదున్నర సంవత్సరాలుగా గిరిజనులు నష్టపోయిన 4 శాతం రిజర్వేషన్ల మేరకు సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి వారికి జరిగిన అన్యాయం విషయంలో దిద్దుపాటు చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి…
ఇప్పటికైనా గిరిజనుల సంక్షేమం.. రిజర్వేషన్ల విషయంలో కేంద్రలోని బిజెపి..రాష్ట్రంలోని టిఆర్.యస్. ప్రభుత్వాలు తమ దంద్వ వైఖరిని మానుకుని గిరిజనుల సంక్షేమానికి చిత్తశుద్ధితో వ్యవహారించాలని డిమాండ్ చేస్తున్నాను. లేనిపక్షంలో వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాను.