– జై జగన్.. జై జనసేన అంటూ కార్యకర్తలు నినాదాలు
తిరుపతి: స్విమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ మీడియాతో మాట్లాడుతుండగా వైసీపీ అధినేత జగన్ అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరుపార్టీల నినాదాలతో హాస్పిటల్ ప్రాంగణం హోరెత్తుతోంది. అరగంట ఆలస్యంగా రావాలని పోలీసులు చెప్పిన వినకుండా జగన్ అక్కడికి చేరుకున్నారు. దీంతో ఓవైపు జై జగన్.. మరోవైపు జై జనసేన అంటూ పార్టీల కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.