Suryaa.co.in

Andhra Pradesh

పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు

– మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 21: గుడివాడ నియోజకవర్గంలో జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెల్పించిన ప్రజలకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీ కొండాలమ్మ దేవస్థానం చైర్మన్ కనుమూరి రామిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా గుడ్లవల్లేరు ఎంపీపీ ఎన్నిక వ్యవహారంపై మంత్రి కొడాలి నానితో చర్చించారు. ఎంపీపీ పదవిని ఎస్సీ జనరల్ కు కేటాయించడం జరిగిందని తెలిపారు. గుడ్లవల్లేరు -2 ఎంపీటీసీగా పూర్ణ కవిత, కుచ్చికాయలపూడి ఎంపీటీసీగా కొడాలి కన్నమ్మ, డోకిపర్రు -1 ఎంపీటీసీగా కొడాలి సురేష్, డోకిపర్రు -2 ఎంపీటీసీగా మేరుగు నాగార్జునలు ఎస్సీ సామాజిక వర్గం నుండి ఎన్నికయ్యారని చెప్పారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నికపై మరోసారి చర్చిద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కోగంటి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE