(రాములు)
ఇది మీకు తెలుసా .. కుక్క తోకను ఆడించాలి కానీ, తోక కుక్కను ఆడించకూడదు అనేది సామెత. శుక్రవారం క్రెడాయ్ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ఎవ్వరూ హాజరుకాకపోవడం ఇందుకు సంకేతం.
దీని ద్వారా పరోక్షంగా తాను ఎవరికి దగ్గరయ్యేది లేదు, ఎవ్వరికీ లొంగేదీ లేదు అనే సంకేతాన్ని సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలి. ఉద్యోగులు ఉద్యోగం చేసుకోవాలి.మాలాంటి రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలి.
కానీ, ఒకదానితో మరొకటి ముడిపెట్టే ప్రయత్నాలు ఇకపై మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విస్పష్టంగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
జీవితంలో, రాజకీయాల్లో ఢక్కాముక్కీలు తిన్న సీఎం రేవంత్ రెడ్డి కి పరిపాలన పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నట్లు ఈ ఘటనతో స్పష్టమవుతుంది.