జగన్ తో.. వైసీపీతో అంటకాగిన అధికారులకి కీలక పదవులు ఇస్తున్నారని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్, సజ్జల ఆదేశాల మేరకు వాళ్ళు నడుచుకోక తప్పలేదు..
అదే సమయంలో వారు ఆవిధంగా ఎందుకు చెయ్యాల్సి వస్తుందో అలాగే ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి అరాచకాల గురించి చంద్రబాబు కి రహస్యంగా సమాచారం అందించి ఉంటారు.. వైసీపీ ప్రభుత్వంలో హైదరాబాద్ లో చంద్రబాబు ని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రహస్యంగా కలిసి క్షమాపణలు చెప్పారన్న వార్తలు అప్పట్లో విన్న విషయం మర్చిపోయారా?
ఇప్పుడు సీఎస్ గా నియమితులైన విజయానంద్ గురించి తీసుకుందాం.. ఆయన 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తో కలిసి విద్యుత్ శాఖలో కీలకంగా పని చేశారు. ఆయన పనితీరు కారణంగా అప్పట్లో విద్యుత్ శాఖకి అనేక అవార్డులు వచ్చాయి..
ఆయన మీద వైసీపీ ప్రభుత్వంలో జగన్ కి అనుకూలంగా పని చేశాడని ఆరోపణలు వచ్చాయి. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తో కలిసి కీలకంగా పని చేసిన అతను, జగన్ ప్రభుత్వంలో ఆవిధంగా ఎందుకు చేయాల్సి వస్తుందో అప్పట్లో చంద్రబాబుకి చెప్పకుండా ఉంటాడా? ఆలోచించండి.. బాబు కి ఆ అవగాహన ఉన్న కారణంగానే కదా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేశాడని తెలిసినా కూడా ఆయనకు సి ఎస్ పదవి ఇచ్చింది.
ఏ పని చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించే బాబు.. ఆమాత్రం ఆలోచన లేకుండా ఆయనకు చీఫ్ సెక్రటరీ లాంటి కీలక పదవి ఇచ్చేస్తాడా? అంటున్నాను అని కాదు ఒకసారి ఆలోచించండి.ఈయ న ఒక్కరే కాదు.. వైసీపీ ప్రభుత్వంలో 90% అధికారాలు జగన్ కి అనుకూలంగానే పని చేశారు. ఆవిధంగా పని చేసారు కాబట్టి ఆ 90% అధికారులను ప్రభుత్వ విధుల నుండి తప్పించడం సాధ్యం అవుతుందా? తప్పించి ఏం చేస్తారు, ఎవరితో పని చేయిస్తారు? ఆలోచించండి. ఏ అధికారిని పదవిలో నియమించినా ప్రతీసారి ఇదే లొల్లి అవుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వెనుక కారణాన్ని అందరికీ వివరంగా చెప్పలేరు.
సపోజ్ విజయానంద్ వైసీపీ ప్రభుత్వంలో పని చేస్తూనే నన్ను రహస్యంగా కలిసి నాకు కీలక సమాచారం ఇచ్చాడు అని బాబు ఓపెన్ గా చెప్పగలరా? జస్ట్ ఆలోచించండి. రాష్ట్ర బాగు కోసం తీసుకునే ప్రతీ నిర్ణయంలో బొక్కలు వెతికి విమర్శిస్తే, అభిమానులు కార్యకర్తలుగా మనకి ఉన్న విలువ పోతుంది. మన పరిధి ఏంటో తెలుసుకుని బాబు మీద నిర్ణయాల మీద విమర్శలు చెయ్యండి. ముందు వెనుక ఆలోచించకుండా ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని విమర్శించి కార్యకర్తల అభిప్రాయాలకు విలువ లేకుండా చెయ్యకండి దయచేసి.
– రవీంద్ర తీగల