• జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల జాబితా చాంతాడంత ఉంటే.. నెరవేర్చింది కేవలం చారడంతే.
• నాలుగున్నరేళ్లకు పైగా సాగిన జగన్ పాలన ఆసాంతం అబద్ధాలు.. అన్యాయాలు.. మోసాలు.. .దుర్మార్గాలు… దోపిడీల మయమని ప్రజలకు అర్థమైంది
• తన ప్రభుత్వ అవినీతి.. తాను చేస్తున్న దోపిడీని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తూ, వారిలో చైతన్యం తీసుకు వస్తున్నాడన్న అక్కసుతోనే జగన్ రెడ్డి, అన్యాయంగా చంద్రబాబుని జైలుకు పంపాడు
• ప్రజలంతా టీడీపీ విడుదల చేసిన ఏపీ హేట్స్ జగన్ పుస్తకాన్ని చదివాలి.. జగన్ నిజస్వరూపం.. వైసీపీ ప్రభుత్వ కపట నైజం తెలుసుకోవాలి
– టీడీపీ జాతీయ కార్యాలయంలో ‘ఏపీ హేట్స్ జగన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో ‘ఏపీ హేట్స్ జగన్’ అని నినదిస్తున్నారు నాలుగున్నరేళ్ల జగన్ దుర్మార్గపు పాలన.. ప్రజల అంతరంగానికి అక్షరరూపమే ‘ఏపీ హేట్స్ జగన్ పుస్తకం’
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, కే.ఎస్.జవహర్, గద్దె రామ్మోహన్ రావు, పంచుమర్తి అనురాధ, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు
స్వతంత్ర్య భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక, ఏ ముఖ్యమంత్రి చేయనంత అన్యా యం.. అరాచకం.. దోపిడీని కేవలం నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేశాడని, రాష్ట్రంలో ని 5 కోట్ల ప్రజలు తన ప్రభుత్వాన్ని ఛీకొట్టేలా చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింద ని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ రెడ్డికి, అతని దిక్కుమాలిన ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చె న్నాయుడు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ నేతలతో కలిసి ఏపీ హేట్స్ జగన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!
నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు…ప్రజల అంతరంగానికి అక్షర రూపం, ‘ఏపీ హేట్స్ జగన్’ పుస్తకం
“ నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు, ప్రజల అంతరంగానికి అక్షర రూపం ‘ఏపీ హేట్స్ జగన్’ పుస్తకం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతులు, అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ‘ఏపీ హేట్స్ జగన్’ అని నినదిస్తు న్నారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా అన్ని వర్గాలవారు జగన్ రెడ్డి బాధితులే. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడకముందు, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రజలు భావించారు.
కొత్త రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు మాత్రమే గట్టెక్కించగలడని నమ్మి, తెలుగుదేశాన్ని గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. ఆనాడు తనను ప్రజలు తిరస్కరించారన్న అక్కసుతో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు టీడీపీ ప్రభుత్వంపై, చంద్రబాబుపై విషప్రచారం చేస్తూనే ఉన్నాడు. 2019 ఎన్నికల సమయంలో ప్రజల్ని హామీలతో, మోసపు వాగ్ధానాలతో నమ్మించ డంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడు.
ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ప్రజల్ని వేధిస్తూ, రాష్ట్రాన్నిదోపిడీ చేస్తూనే ఉన్నాడు. తన దోపిడీ, అవినీతిని వాస్తవాల తో ప్రజల ముందు ఉంచుతున్నాడని, వారిలో చైతన్యం వస్తే తనకు, తన ప్రభుత్వానికి సమాధి కడతారని భావించే చేయని నేరానికి చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపాడు. జైల్లో ఉన్నా కూడా చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై, టీడీపీపై నింద లేస్తూ ప్రజల్ని ఇంకా మోసగించే ప్రయత్నం చేస్తున్నాడు.
బిడ్డ అంటే నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచేవాడా జగన్ రెడ్డి?
నేను మీ బిడ్డను అంటూ ఈ మధ్య జగన్ కొత్త రాగం ఎత్తుకున్నాడు. బిడ్డ అంటే తల్లిదండ్రుల్ని, ఇతర కుటుంబసభ్యుల్ని, తనను నమ్మిన వారిని బాగా చూసుకోవాలి. కానీ జగన్ ఇప్పటివరకు చేసింది.. చేస్తున్నది అంతా అందుకు పూర్తి విరుద్ధం. బిడ్డ అంటే నమ్మిన వారిని నట్టేట ముంచేవాడా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. బిడ్డ అంటే రాష్ట్రానికి తీరని అన్యాయం.. ప్రజలకు తీవ్ర ద్రోహం చేయడమేనా జగన్ రెడ్డి?
ఎన్నికలకు ముందు మేనిఫెస్టో తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ తో సమానమని చెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని నెరవేర్చకుండానే అన్నీ చేసేశానని ప్రజల్ని ఏమార్చేప్రయత్నం చేస్తున్నాడు. జగన్ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు చాంతాడంత ఉంటే, వాటిలో అమలు చేసినవి చారెడంతే.
2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్.. మద్యపాన నిషేధం.. సీపీఎస్ రద్దు… ప్రత్యేకహోదా.. 25లక్షల ఇళ్లనిర్మాణం..పోలవరం నిర్మాణం… అమరావతి ఆకాంక్షలు.. ఏమయ్యాయో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి
2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని, ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న హామీ ఏమైందో జగన్ రెడ్డి యువతకు చెప్పాలి. ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు వస్తాయి.. యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని, కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి హోదా తెస్తానని చెప్పిన జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో హోదా ఎందుకు తీసుకురాలేదో రాష్ట్రయువతకు సమాధానం చెప్పాలి సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైందో.. రాష్ట్రంలో ఎక్కడా మద్యం దొరక్కుండా చేస్తాను.. కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే దాన్ని పరిమితం చేస్తానన్న వాగ్ధానం ఏమైందో ముఖ్యమంత్రి మహిళలకు సమాధానం చెప్పాలి.
కల్తీ మద్యాన్ని అధికధరలకు అమ్ముతూ తన ఖజానా నింపుకుంటున్న జగన్ రెడ్డి, మహిళల తాళిబొట్లతో చెలగాటమాడుతూ, పేదల మానప్రాణాలు ఎందుకు బలితీసుకుంటున్నాడో చెప్పాలి. సీ.పీ.ఎస్ రద్దు హామీ ఏమైందో.. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు.. ఎరియర్లు.. ఇతర ప్రయోజనాలు ఏమయ్యాయో ఉద్యోగులకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. సక్రమంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాస్ట్రాన్ని తీసుకురావడమేనా జగన్ బిడ్డ సాధించిన ఘనత?
రాష్ట్రానికి ఆయువు పట్టైన పోలవరాన్ని పూర్తిచేస్తానని చెప్పి, చివరకు నాలుగున్నరేళ్లలో 4 శాతం పనులు కూడా ఎందుకు చేయలేదో రాష్ట్ర రైతాం గానికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిని నిర్మిస్తానని.. రాజధానిలోనే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పిన వ్యక్తి, చివరకు మూడు రాజధానుల నాటకమాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎందుకు చేశాడో ప్రజలకు సమాధానం చెప్పాలి.
టీడీపీప్రభుత్వం అమలుచేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దుచేసి, ఇసుక దోపిడీతో రూ.40వేల కోట్లు కొట్టేసిన జగన్ రెడ్డి నిర్వాకంతో 40 లక్షలమంది నిర్మాణరంగ కార్మికులు రోడ్డునపడ్డారు. ప్రజలకు ఇసుక అందుబాటులో లేకుండా చేసి, 120కి పైగా కులవృత్తులకు ఉపాధి లేకుండా చేయడమేనా జగన్ రెడ్డి సాధించిన ఘనత? చంద్రబాబు ప్రపంచస్థాయి పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకు వస్తే, తన కమీషన్లు, దోపిడీ కోసం వాటిన జగన్ రెడ్డి రాష్ట్రం నుంచి తరిమేసింది నిజంకాదా?
లులూగ్రూప్, ఫ్ల్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్, అమర్ రాజా సంస్థలు రాష్ట్రానికి ఎందుకు గుడ్ బై చెప్పాయో ముఖ్యమంత్రి చెప్పాలి. 2018 వరకు పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం నేడు ఆ జాబితాలోనే ఏపీ ఎందుకు లేకుండా పోయిందో జగన్ సమాధానం చెప్పాలి. చంద్రబాబు పేదలకోసం అమలుచేసిన విదేశీవిద్య పథకం, పెళ్లికానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, చంద్రన్న బీమా, అన్యాక్యాంటీన్ల వంటి వాటిని జగన్ నిర్దాక్షణ్యంగా రద్దు చేశాడు.
చంద్రబాబు పేదలకోసం నిర్మించిన లక్షల ఇళ్లను గాలికి వదిలేసి, వాటిని పేదలకు ఇవ్వకుండా, 5 ఏళ్లల్లో 25లక్షల ఇళ్లు నిర్మించి పేదల్ని ఉద్దరిస్తానన్న జగన్ రెడ్డి, నాలుగేళ్లలో ఒక్కరికి ఒక్కఇల్లు కూడా ఎందుకు కట్టివ్వలే దో, జగనన్న ఊళ్లు అంటూ ఉత్తమాటలతో ఎందుకు ఊదర గొడుతున్నాడో సమాధా నం చెప్పాలి. ప్రజలు చివరకు తమ మానప్రాణాలు..స్వేచ్ఛ, హక్కుల కోసం ఎందుకు పోరాడుతున్నారో… వారికి ఆ పరిస్థితి ఎందుకు కల్పించాడో ముఖ్యమంత్రి చెప్పాలి.
40 రోజులైనా చంద్రబాబు ఆవగింజంత అవినీతి చేశాడని కూడా జగన్ నిరూపించలే కపోయాడు
ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ దోపిడీని ప్రశ్నిస్తున్నారనే ప్రతిపక్షపార్టీలపై.. నేతలపై జగన్ కక్ష కట్టాడు. తన దోపీడీని, అవినీతిని.. తన ప్రభుత్వ దుర్మార్గాలు, వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నాడన్న అక్కసుతోనే చంద్రబాబుని అన్యాయంగా జగన్ జైలుకు పంపాడు. దేశప్రధానికి కూడా ఆలోచన రాకముందే రాష్ట్ర యువత భవిష్యత్ కోసం చంద్రబాబు ఆలోచించాడు.
యువత జీవితాలు బాగుంటే, రాష్ట్రం బాగుపడుతుందన్న గొప్పఆలోచనతో చంద్రబాబు ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేసి అన్యాయంగా టీడీపీ అధినేతను జైలుకు పంపా డు. 40 రోజులైనా ఆవగింజంత అవినీతిని కూడా ప్రజలముందు, న్యాయస్థానాల్లో నిరూపించలేకపోయాడు. 40 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నా న్యాయస్థానాలు ఎందుకు వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధీనంలోని విచారణాసంస్థల్ని ప్రశ్నించడం లేదు?
అమరావతి నిర్మాణాలకోసం ప్రజలసొమ్ము దుర్వినియోగం చేశారన్న మంత్రి బొత్స, నేడు రుషికొండపై జగన్ రెడ్డి నిర్మిస్తున్న రాజప్రాసాదంపై నోరు మెదపడేం?
రాజధాని అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ నేడు ఉత్తరాంధ్రను దోచుకో వడానికే తన మకాంను విశాఖపట్నానికి మారుస్తున్నాడు. రుషికొండపై ప్రజల సొమ్ముతో విలాసవంతమైన రాజప్రాసాదాన్ని నిర్మించుకుంటున్నాడు. గతంలో రాజధాని నిర్మాణంపై పిచ్చికూతలు కూసిన మంత్రి బొత్ససత్తిబాబు నేడు రుషికొండపై ముఖ్యమంత్రి కోసం నిర్మిస్తున్న భారీ ప్యాలెస్ పై నోరు మెదపడేం?
అమరావతిలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన నిర్మాణాలకు చదరపు అడుగుకి రూ.6 వేలు చెల్లిస్తేనే.. అవినీతి చేశారని గగ్గోలు పెట్టిన వైసీపీనేతలు.. నేడు జగన్ రెడ్డి చదరపు అడుగుకి రూ.28 వేలు చెల్లిస్తుంటే నోరు ఎత్తరేం? జగన్ రెడ్డి బాత్రూమ్ లకు.. టాయ్ లెట్ల నిర్మా ణానికి వేలకోట్ల ప్రజలసొమ్ము తగలేస్తారా?
సముద్రం పక్కన విలాసవంతంగా జీవించడానికే జగన్ విశాఖ వెళ్తున్నాడు
ఉత్తరాంధ్రప్రజలు అమాయకులు.. వారిముందు తమ ఆటలు సాగుతాయన్నఆలోచన తోనే జగన్ విశాఖపట్నంలో కాపురం పెట్టబోతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలు నాలుగు న్నరేళ్లుగా తమను పట్టించుకోని జగన్ రెడ్డికి, అతని ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం సముద్రం పక్కన విలాసవంతమైన జీవితం గడపడానికే జగన్ విశాఖ పట్నానికి వెళ్తున్నాడు. చంద్రబాబునాయుడి కంటే తాను దేనిలో మెరుగో జగన్ రెడ్డి చెప్పాలి. జగన్ రాష్ట్రానికి పట్టిన శని అని ప్రజలంతా భావిస్తున్నారు” అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.