ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం

అమరావతి : ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో జాప్యంపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. నాలుగు వారాలలోపు బిల్లులు చెల్లించకపోతే బిల్లుల మొత్తంపై వడ్డీని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వర్తించవని ధర్మాసనం చెప్పింది. తమకు బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ధర్మాసనానికి వివరించారు. న్యాయవాదులు వడ్డీని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు కోరారు. నాలుగు వారాల్లో చెల్లించకపోతే వడ్డీ రద్దు ఉత్తర్వులు ఆటోమేటిక్‌గా రద్దై పోతాయని ధర్మాసనం స్పష్టం చేసింది.