– సి.ఎం సొంతజిల్లాలోనే శాంతిభద్రతలు లేవు
– టీడీపీ నేత జయరామిరెడ్డికి ఏదైనా జరిగితే జగన్ రెడ్డిదే బాధ్యత
– టిడిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, కింజరాపు అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో వైసీపీ దురాఘతాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. మొన్న నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై, నిన్న కొండేపిలో బాలవీరాంజనేయ స్వామిపై దాడికి పాల్పడ్డారు. టంగుటూరులో సుధాకర్ అనే టీడీపీ నాయకుడు పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నాడని ఆయన భార్యను ట్రాక్టర్ తో తొక్కించి మరీ చంపేశారు. నేడు కడప జిల్లా, గోపవరంలో టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డిపై ఇంటిలోకి చొరబడి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చడం సైకో పాలనకు నిదర్శనం. రాష్ట్రంలో ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు చేస్తుంటే జగన్ రెడ్డి సంతోషించడాన్ని ఏమంటారు?
శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు వైసీపీ రౌడీమూకలను కట్టడి చేయడం మాని వారికి వత్తాసు పలుకుతూ చోద్యం చూస్తున్నారు. సి.ఎం సొంత జిల్లాలోనే శాంతిభద్రతలు కరువయ్యాయి. ప్రతిపక్ష నేతలపై వైసీపీ గూండాల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారం శాశ్వతం కాదని జగన్ రెడ్డి, ఆయన ముఠా గుర్తిస్తే మంచిది. జగన్ రెడ్డి పతనం కదప నుంచే ప్రారంభమౌతుంది. జయరామిరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఏదైనా జరగరానిది జరిగితే జగన్ రెడ్డే బాధ్యత వహించాలి. దాడికి పాల్పడ్డ నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.