జగన్ బాధితుల్లో రెడ్లే ఎక్కువ

– సజ్జల, సాయిరెడ్డి, పాపాల పెద్ది రెడ్డి, సుబ్బా రెడ్డి కి తప్ప ఏ ఇతర కుటుంబానికి న్యాయం జరగలేదు.
– జగన్ పాలనలో రెడ్ల పైనే వేధింపులు ఎక్కువ
– రెడ్ల ఆస్తుల పై దాడులు చేస్తున్నారు… టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులు అన్ని తొలగిస్తాం.
– జగన్ చేసిన అసత్య ప్రచారాన్ని నమ్మి రెడ్డి సోదరులు మోసపోయారు
– జగన్ గురించి ఎక్కువ ఊహించుకుని రెడ్లు నష్టపోయారు
– అధికారంలోకి వచ్చాక రెడ్లను కూడా జగన్ ముంచేశాడు
– రెడ్లకు జగన్ ఇప్పుడు గౌరవం లేకుండా చేశాడు
– టీడీపీ హయాంలోనే రెడ్లకు గౌరవం, ప్రాధాన్యం
– రెడ్డి కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
– మేం అధికారంలోకి వచ్చాక బిల్లులు చెల్లిస్తాం.. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు
– కడప నియోజకవర్గం రెడ్డి సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్

రెడ్లలో ఉన్న పేదలను ఆదుకోవాలి. ఏపిలో రెడ్డి భవనం ఏర్పాటు కు సహాయం చెయ్యాలి
– బాలకృష్ణా రెడ్డి
కాంట్రాక్టులు చేసి నష్టపోయాం. జగన్ పాలనలో పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదు.
– రవి శంకర్ రెడ్డి
రాయలసీమ లో రెడ్లు ఎక్కువుగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు ఎటువంటి సాయం అందడం లేదు. డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వడం లేదు.
– అంకి రెడ్డి
జగన్ మొదట కూల్చిన ఇళ్లు నాదే. ఇంట్లో 80 లక్షల రూపాయల సామాన్లు కూడా దొచుకుపోయారు. అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఎంత ఇబ్బంది పెట్టినా పోరాడతాం.
అక్రమ కేసులు తొలగించాలి.
– నాగ భూషణ్ రెడ్డి
చదువుకున్న రెడ్డి యువతకు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలి.
– ప్రసాద్ రెడ్డి
జగన్ సిఎం అయిన వెంటనే నా తమ్ముడ్ని మర్డర్ చేశారు. ఇప్పటి వరకూ నాకు న్యాయం జరగలేదు. పైగా వ్యక్తిగత కక్షలు అని ముద్ర వేశారు.
– రామచంద్రారెడ్డి
జగన్ అనేక హామీలు ఇచ్చాడు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను. రైతులను కార్పొరేషన్ ద్వారా ఆదుకుంటాం అని హామీ ఇచ్చాడు. ఒక్క రూపాయి సాయం చేయలేదు.
– పాపిరెడ్డి
నా కొడుకుని హత్య చేశారు. నా ఆస్తి లాక్కున్నారు. వైసిపి నాయకులు వేధిస్తున్నారు.
– మునమ్మ
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
– వేణుగోపాల్ రెడ్డి
…కడప జిల్లా రెడ్డి సామాజికవర్గం ప్రతినిధులు

అందుకు స్పందించిన లోకేష్ ఏమన్నారంటే..
పాదయాత్ర మొదలు పెట్టిన తరువాత తెలిసింది జగన్ పాలనలో ఎక్కువ నష్టపోయింది రెడ్డి సోదరులు. రెడ్డి సామాజికవర్గం జగన్ చేతిలో బాధితులుగా మారారు. కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు. సజ్జల, సాయిరెడ్డి, పాపాల పెద్ది రెడ్డి, సుబ్బా రెడ్డి కి తప్ప ఏ ఇతర కుటుంబానికి న్యాయం జరగలేదు. రెడ్డి సోదరులు మొదటి నుండి తెలుగుదేశం కి అండగా నిలిచారు. జగన్ పాలనలో రెడ్లకు కనీస గౌరవం దక్కడం లేదు. తెలుగుదేశం పార్టీ మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి గౌరవం ఇచ్చింది. 2014 నుండి 19 వరకూ రెడ్లకు అనేక ముఖ్య పదవులు ఇచ్చాం. జగన్ కొన్ని అపోహలు కల్పించాడు. నిజం ఇంటి గడప దాటే ముందు అబద్దం ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. జగన్ చేసిన అసత్య ప్రచారాన్ని నమ్మి రెడ్డి సోదరులు మోసపోయారు.

జగన్ పాలనలో రెడ్డి కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. నిన్నే టిడిపి నాయకుడు జయరాం రెడ్డి పై వైసిపి నాయకులు దాడి చేశారు. పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ల లో ఉన్న పేదలను ఆదుకుంటాం. రెడ్డి భవనం ఏర్పాటు కు సహకరిస్తాం. పెండింగ్ బిల్లులు అన్ని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తాం. కాంట్రాక్టర్లు అధైర్య పడొద్దు.

జగన్ పాలనలో రెడ్ల పైనే వేధింపులు ఎక్కువ అయ్యాయి. రెడ్ల ఆస్తుల పై దాడులు చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులు అన్ని తొలగిస్తాం. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన అధికారుల పై చర్యలు తీసుకుంటాం. నా వ్యక్తిగత సిబ్బంది లో కూడా రెడ్లు ఉన్నారు.

నేను నమ్మే వాస్తు సిద్ధాంతి జయరాం రెడ్డి
రెడ్డి సోదరులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. రాంగోపాల్ రెడ్డి కి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి గెలిపించుకున్నాం. జగన్ లా దొంగ హామీలు ఇచ్చి మోసం చెయ్యను. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. జగన్ గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు. టిడిపి లో మాత్రమే రెడ్లకు గౌరవం దక్కుతుంది.
రెడ్డి కార్పొరేషన్ పెట్టడమే తప్ప జగన్ ఒక్క రూపాయి కేటాయించలేదు. టిడిపి వచ్చిన వెంటనే రెడ్ల లో ఉన్న పేదలకు సాయం చేస్తాం. మునమ్మ కుమారుడిని ప్రత్యర్థులు చంపేస్తే పిల్లల్ని టిడిపి చదివించింది. అది రెడ్ల పట్ల టిడిపి కి ఉన్న చిత్తశుద్ది.

పాదయాత్ర లో రాయలసీమ రైతుల కష్టాలు నేను చూసాను. రాయలసీమ ను హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. దానిమ్మ, అరటి, బొప్పాయి, మామిడి, కర్జూరం తదితర పంటలు వేసేలా అధిక ప్రోత్సాహం ఇస్తాం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పంటలు వేయాలి, అందులో కొత్త రకాలు తీసుకొచ్చేందుకు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. గతంలో లాగానే 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తాం. పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తాం. రాయలసీమ రైతులకు సరైన ప్రోత్సాహం ఇస్తే బంగారం పండిస్తారు. వ్యవసాయానికి పాత భీమా పథకాన్ని అమలు చేస్తాం.

పరిపాలన ఒకే చోట…అభివృద్ది వికేంద్రీకరణ టిడిపి నినాదం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం. ఫ్యాక్షన్ లో ఇబ్బంది పడిన కుటుంబాలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్నాం. మీ తమ్ముడు పిల్లల్ని చదివించే బాధ్యత నాది అంటూ రామచంద్రా రెడ్డి కి భరోసా ఇచ్చిన లోకేష్. మీ తమ్ముడ్ని చంపిన వారిని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. రైతులకు కులం ఉండదు. ఇప్పుడు రైతుల్లో కూడా జగన్ ప్రభుత్వం కులం చూస్తుంది. మోటార్ల మీటర్లు పెట్టి రైతులను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది.

పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత టిడిపి ది. విద్యా దీవెన, వసతి దీవెన అంత చెత్త కార్యక్రమం మరొకటి లేదు. ఫీజులు సకాలంలో చెల్లించక యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు.సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు జగన్ పాలన వలన సర్టిఫికేట్లు రాక ఇబ్బంది పడుతున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒన్ టైం సెటిల్మెంట్ చేసి సర్టిఫికెట్లు అందజేస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పీజీ ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభిస్తాం.

Leave a Reply