Suryaa.co.in

Andhra Pradesh

యువగళం పాదయాత్రపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గం

• పోలీసులే వైసీపీ ప్లెక్సీలు కడుతూ, టీడీపీనేతలపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటి?
• జగన్ పాలనలో 200మంది అమరావతి రైతులు చనిపోయారు
– టీడీపీ అధికారప్రతినిధి పాతర్ల రమేశ్

యువగళం పాదయాత్రలో నిన్న వైసీపీ గూండాల దాడి అత్యంత దుర్మార్గమని, లోకేశ్ పాదయాత్ర చూసి వైసీపీ నేతలకు వణుకుపుడుతోందని టీడీపీ అధికారప్రతినిధి పాతర్ల రమేశ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ… “ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో వైసీపీ గూండాలు కావాలనే లోకేశ్ యువగళం యాత్ర ను అడ్డుకుంటున్నారు. వారిని కట్టడిచేయాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమిత మయ్యారు. లోకేశ్ పాదయాత్రకు ఎవరు ఎలాంటి అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

పోలీసులే వైసీపీ ప్లెక్సీలు కడుతూ, టీడీపీ ప్లెక్సీలు తీసేయడం.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం చేస్తున్నారు. లోకేశ్ ను ఉద్దేశించి ఎంపీ భరత్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన కళ్లతో చూస్తే యువగళం పాదయాత్ర లో జనం ఉన్నారో లేదో తెలుస్తుంది. వైసీపీ ఎంపీలకు ప్రత్యేకహోదాపై మాట్లాడే ధైర్యం లేదుగానీ, యువగళం యాత్రపై విమర్శలు చేయడం తెలుసు.

అమరావతి రైతులు 1300 రోజులకుపైగా పోరాడుతుంటే, వారిని పోలీసులతో అణచి వేయాలని ప్రభుత్వం చూడటం దుర్మార్గం. అమరావతిలో 200 మంది రైతుల్ని బలి తీసుకున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు శిక్షించే రోజు దగ్గర్లోనే ఉంది. దళితులు, బీసీలపై ఈ ప్రభుత్వంలో దాడులు ఎక్కువయ్యాయి. ఇలాంటి ఘటనలన్నింటిపై టీడీపీ ప్రభుత్వం రాగానే విచారణ జరిపించి, తప్పుచేసిన వారిని శిక్షిస్తాం. రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్ని వేలంద్వారా అమ్మేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది.

ఎకరం రూ.6 కోట్లకు అమ్మడానికి ఇప్పటికే ప్రణాళికలు వేసింది. జగన్ రెడ్డి చర్యల్ని ప్రజలు గమనిస్తున్నారు. రైతులు 34 వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి ఇస్తే, అమరావతిని నాశనం చేసిన జగన్ రెడ్డి మూడు రాజధానులంటున్నాడు. 151 ఎమ్మె ల్యేల బలముందని జగన్ రెడ్డి ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు చేయవచ్చు. కానీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడానికి ఎదురు చూస్తున్నారు. వాస్తవం గ్రహించి ముఖ్యమంత్రి ఇప్పటికైనా జాగ్రత్తగా వ్యవహరిస్తే మం చిది.” అని రమేశ్ హితవు పలికారు.

LEAVE A RESPONSE