అమరావతి: దేశవ్యాప్తంగా హిందుత్వ ఎజెండాను అమలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. తాడేపల్లిలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడం, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాయడం తప్పిస్తే మోదీ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. విభజన హామీలను అమలు చేయడంలోనూ కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలు భాజపాకి సహకరిస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారాట్, బీవీ రాఘవులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు.