కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం సముద్రంలో పదిమంది జాలర్లు ప్రయాణిస్తున్న బోటు హటాత్తుగా తిరగబడింది. దానితో అందులోని పదిమంది జాలర్లు తిరగబడ్డ ఆ బోటుపైకెక్కి, స్థానికులు, తమ తోటి జాలర్లకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జాలర్లు అధికారులకు విషయం చేరవేశారు. వెంటనే రంగంలోకి దిగిన మెరైన్ పోలీసులు.. యస్. యానాం ఓఎన్జీసీ హెలికాప్టర్ సాయంతో పదిమందిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే కాకుండా, అదే హెలికాప్టర్‌లో వారిని కాకినాడకు చేర్చారు. కాగా పదిమంది జాలర్లను కాపాడిన మెరైన్ పోలీసులకు జాలర్ల కుటుంబాలు కృతజ్ఞత తెలిపాయి.