Suryaa.co.in

Andhra Pradesh

మాజీ మంత్రి జెఆర్‌ పుష్పరాజ్‌ మృతి పార్టీకి తీరని లోటు

తెలుగుదేశంపార్టీ సీనియర్‌ నాయకులు, మాజీమంత్రి జెఆర్‌ పుష్పరాజ్‌ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. నిబద్ధతతో, నిజాయితీతో పుష్పరాజ్‌ చేసిన రాజకీయం నేటి యువతకు ఆదర్శమన్నారు. అధ్యాపక వృత్తిని వదిలి స్వర్గీయ ఎన్‌టిఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా అనేక పథకాలకు పుష్పరాజ్‌ నాంది పలికారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారు. ఏపీ ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా ప్రజలకు విశేషమైన సేవలందించారు. కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషించారని చంద్రబాబునాయుడు కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

LEAVE A RESPONSE