యువనేత నారా లోకేష్ ఎదుట ఓ తల్లి ఆవేదన
మంగళగిరి: “నేను 30సంవత్సరాలుగా గొడవర్రు గ్రామంలో ఉంటున్నాను, బతికిఉన్న నేను చచ్చిపోయానని రేషన్ కార్డు తీసేశారు, రేషన్ కార్డు లేకపోతే పెన్షన్ రాదని చెబుతున్నారు, ఇదెక్కడి న్యాయం అయ్యా” అంటూ ఓ వృద్ధురాలు యువనేత లోకేష్ ఎదుట కన్నీరు మున్నీరైంది.
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం గొడవర్రులో రచ్చబండ సభకు లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీ సామ్రాజ్యం అనే వృద్ధురాలు తనకు జరిగిన అన్యాయాన్ని లోకేష్ కు విన్నవిస్తూ మీరు వచ్చాకైనా నాకు రేషన్ కార్డు, పెన్షన్ ఇప్పించాలని కోరింది. వృద్ధురాలు ఆవేదనతో చలించిన లోకేష్ స్పందిస్తూ… కుంటిసాకులు, కొర్రీలతో రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల పెన్షన్లు తొలగించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష్మీసామ్రాజ్యం లాంటి పండుటాకులకు ఎటువంటి షరతులు లేకుండా పెన్షన్ అందించే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.