– అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం లో జరిగిన నిరసన ర్యాలీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భట్టి
ఖమ్మం: భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఉల్లంఘించిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయాలి. రాజ్యాంగం అంటే ఏ కొద్ది మంది దళితులు బలహీనవర్గాలు పేదవారికి సంబంధించినది కాదు.ప్రతి ఒక్కరి కి సంబంధించినది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, మహిళలకు ఆస్తిలో హక్కు, ఈ దేశ వనరులు, సంపద సమానంగా పంచబడాలని రాజ్యాంగం చెప్పింది.
రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా కోరడం మనందరి నైతిక హక్కు రాజ్యాంగాన్ని బలహీనపరచాలని బిజెపి భావిస్తుంది. ఈ అంశాన్ని గత ఐదు సంవత్సరాలుగా దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించి వివరిస్తున్నారు.. ఆయన చెప్పిందే నిజం అన్నట్టు తాజాగా పార్లమెంటులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశారని తెలిపారు.