– బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిరసనగండ్ల శ్రీనివాసులు
ఎర్రగొండపాలెం నడిబొడ్డులో ఇజ్రాయిల్ పేట్లో పెట్టిన నిర్మించిన అక్రమ ప్రార్థన మందిరంను మంత్రి ఆదిమూలపు సురేష్ కారణంగానే ఆ అక్రమ చర్చి నిర్మాణం జరిగింది. ఆ అక్రమార్చి నిర్మాణం హిందువులు పవిత్రంగా గ్రామదేవతగా భావించే పోలేరమ్మ గుడి పక్కనే చట్ట విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించాలని ప్రయత్నం చేయడమే ఈ ఘర్షణలకు కారణం.
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రతి దేవాలయం పక్కన అక్రమ చర్చి గాని లేదా అక్రమశిలువలను గాని పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆదిమూలపు సురేష్ ప్రయత్నం చేస్తుండటంతో, అసెంబ్లీలో ప్రతిచోట ప్రజల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. ఇవి అన్ని కూడా గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న గొడ్రాలికొండమీద అక్రమశిలవగానీ దేవరాజుగట్టు లోని సూర్యనారాయణ స్వామిని కొండమీద గాని ఈరోజు జరిగిన ఇజ్రాయిల్ పేటలో జరిగిన సంఘటన గాని మంత్రి సురేష్ కి ఉన్న మతపిచ్చే కారణం.
ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు ఆయన ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మరియు మంత్రి అయిన నాటి నుంచి పశ్చిమ ప్రకాశంలో విపరీతంగా మతమార్పిడులకు మరియు అక్రమ అన్యమత ప్రార్థన మందిరం నిర్మాణాలకు ప్రోత్సహించడమే ఇలాంటి ఘర్షణలకు కారణం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమైన ప్రమాణం చేసి , అన్ని కులాలను అన్ని మతాలను కాపాడుతానని చెప్పి వచ్చినటువంటి ఈ మంత్రి ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి, ప్రమాణాన్ని గాలికి వదిలి మతమార్పిడి చర్యలకు పాల్పడడం రాజ్యాంగ విరుద్ధం.
భారతీయ జనతా పార్టీ డిమాండ్స్…
1. అక్రమంగా నిర్మించిన అన్యమత ప్రార్థన మందిరాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనపర్చుకోవాలి.
2. పంచాయతీ అనుమతులు లేకుండా నిర్మించ తలపెట్టిన ఆర్చి నిర్మాణాన్ని వెంటనే ఆపివేసి నిర్మాణం ప్రయత్నం చేసిన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
3. హిందువులపై దాడి చేసి హిందువులలో బయోత్పాతానికి కారణమైన పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
4. అక్రమ అన్యమత ప్రార్థనా మందిరం నిర్మాణానికి మరియు ఈ ఘర్షణలకు కారణమైన మంత్రి ఆది మూలపు సురేష్ వెంటనే రాజీనామా చేయాలి.
నిన్న రాత్రి ఎర్రగొండపాలెం నడిబొడ్డున ఉన్న పోలేరమ్మ గుడి దగ్గర జరిగినటువంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాను…. అక్రమ అన్యమత ప్రార్థన మందిరం కోసం అక్రమంగా హిందూ దేవాలయం అనుకోని ఆర్చి నిర్మాణం చేయడాన్ని అడ్డుకున్న హిందువులపై అధికార పార్టీ అండతో చెలరేగిపోతున్న మతమార్పిడి మాఫియా మద్దతుగా పోలీసులు లాటి చార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసుల లాటిఛార్జికి గురి అయిన మరియు అన్యమతస్తుల దాడులకు గురి అయిన హిందూ బంధువులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని నింపి భవిష్యత్తులో వారికి ఏ కష్టం వచ్చినా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికి రేపు ఎర్రగొండపాలెం నికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వెళుతుంది.