Suryaa.co.in

Andhra Pradesh

తనకు వచ్చిన సమాచారంతోనే సీఎం మాట్లాడారు

– బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారంతో ఆయన ప్రకటన చేశారని ఎంపి, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. అధికారులతో సమీక్ష చేసుకున్న తర్వాతే తిరుమల లడ్డూ విషయంపై మాట్లాడి ఉంటారని అన్నారు.

ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ‘మీరు ఎందుకు అలా మాట్లాడారు అని కోర్టులకు అడిగే హక్కు ఉంటుందా అనేది అందరూ ఆలోచన చేయాలి. లడ్డూ విషయంలో న్యాయస్థానంలో కూడా విచారణ జరుగుతుంది. వివిధ సమస్యలపై ప్రజలు విజ్ఞాపన పత్రాలు అందిస్తున్నారని అన్నారు.

LEAVE A RESPONSE