Suryaa.co.in

Entertainment National

రజనీకాంత్ కు స్టెంట్

– రెండు రోజుల్లో డిశ్చార్జ్

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కు వైద్యులు స్టెంట్ వేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించాయి. ఐసీయూలో ఉన్న రజనీని… వైద్యులు ఇప్పుడు సాధారణ వార్డుకు తరలించారు.రజనీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని రజనీ భార్య లత తెలిపారు.

గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని, దీనికి చికిత్స అందించామని డాక్టర్లు పేర్కొన్నారు. రజనీకాంత్ కు నాన్ సర్జికల్, ట్రాన్స్ క్యాథెటర్ విధానంలో చికిత్స అందించినట్టు ఆ బులెటిన్ లో తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వెల్లడించారు.

LEAVE A RESPONSE