మాట తప్పిన సీఎం పదవి నుండి తప్పుకోవాలి

బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు

ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు జిపిఎస్ ను బలవంతంగా రుద్దాలని చూస్తున్న సందర్భంగా వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అధికారంలో వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ మాటని నిలబెట్టకోకుండా జిపిఎస్ అంటూ మరో కొత్త నాటకాన్ని తెరపైకి తేవడం ఉద్యోగులకు వెన్నుపోటు పొడవడమే అన్నారు. మాట తప్పిన వారు పదవి నుండి దిగిపోవాలని గతంలో ముఖ్యమంత్రిగారే చెప్పారని కావున ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయిన ఆయనే తొలుత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఒక్కసారి మాటతప్పిన వారే సీఎం దృష్టిలో తప్పుచేసినవారైతే మరి సీపీఎస్ విషయంలో 120 సార్లు మాటతప్పిన సీఎం ఏమవుతారో ఆయనే చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి సిపిఎస్ రద్దు పై సమావేశాలంటూ ఉద్యోగులను మోసం చేస్తూ ఇప్పుడు మంత్రుల కమిటీ చేత కొత్తగా జిపిఎస్ అమలు చేస్తామని ప్రకటించడం చాలా దారుణం అన్నారు. ఆఖరుకు ఉద్యోగులు తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై అక్రమ పోలీసు కేసులు బనాయించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

దేశంలోని ఎన్నో రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేసిన మన రాష్ట్రంలో మాత్రం రద్దు చేయకుండా ఉద్యోగులను తీవ్ర క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. మేక వన్నె పులిలాంటి ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగులు ఇక ఎప్పటికీ నమ్మబోరని, ఎట్టి పరిస్థితుల్లోనూ జిపిఎస్ ను ఒప్పుకోబోరని, తమ చివరి శ్వాస వరకు పాత పింఛను కోసమే పోరాడుతారన్నారు. తమ హక్కుల కోసం పోరాడే ఉద్యోగులను భయపెట్టేందుకు కేసులు నమోదు చేసినా, జైల్లో పెట్టినా తమ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తారని, ప్రాణాలర్పించైన సిపిఎస్ ను సాధించుకుంటారన్న విశ్వాసం ప్రజల్లో వుంది . వారికి అన్ని రకాలుగా బి. జె. పి. మద్దతుగా నిలుస్తుంది