-
ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చే సూపర్ సిక్స్ పథకాలను అందించే ప్రభుత్వం
-
జగ్గంపేట ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
-
జగ్గంపేట పంచాయతీలో3 కోట్ల 50 లక్షలతో సిమెంట్ రోడ్లు, 8 కోట్లతో సిమెంట్ డ్రైన్లు ఏర్పాటుకు నిధులు తెచ్చాను
ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చే ప్రభుతం అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణమండపం లో శుక్రవారం జరిగిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో శాసన శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన, బిజెపి ఇన్చార్జిలు తుమ్మలపల్లి రమేష్, దాట్ల కృష్ణ వర్మ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడతుందన్నారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్నారన్నారు. సూపర్ సెక్స్ పథకాలను తొందరలోనే అమలు చేస్తామని దీపావళికి ఉచిత సిలిండర్, ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు కొత్త బస్సులు కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. ఆడబిడ్డ నిధి కింద సంక్రాంతి నుంచి ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అందిస్తామని సూపర్ సిక్స్ పథకాలు అందిస్తామని అన్నారు.
జగ్గంపేట పంచాయతీలో3 కోట్ల 50 లక్షలతో సిమెంట్ రోడ్లు, 8 కోట్లతో సిమెంట్ డ్రైన్లు ఏర్పాటుకు నిధులు తెచ్చాను అని ఎమ్మెల్యే అన్నారు. అధికారులు లేని ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలం నాలుగు లక్షల రూపాయలు హౌసింగ్ లోన్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, ఎంపీపీ అత్తులూరి నాగబాబు, కందుల చిట్టిబాబు, సర్పంచ్ బచ్చల నాగరత్నం, అడబాల వెంకటేశ్వరరావు, బుర్రి సత్తిబాబు, రుచి హోటల్ నాగేంద్ర, వేములకొండ జోగారావు, ఎమ్మార్వో, ఎంపీడీవో, సర్పంచులు, ఎంపీటీసీలు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు అన్ని శాఖల అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.