Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమీ కొనేటట్లు లేదు, ఏమీ తినేటట్లు లేదు

– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్

జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాల పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరు. పేద, మధ్య తరగతి ప్రజలు ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు అని బాధపడుతున్నారు. రాష్ట్రంలో చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి తన మంత్రివర్గ సహచరులతో కలిసి సభలు, సన్మానాల్లో నిమగ్నమవటం బాధాకరం. ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం బక్షిస్తోంది.

అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నాయకుడి హోదాలో నిత్యవసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు తను చేస్తున్నదేమిటో చెప్పాలి. మాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేమో వీరబాదుడు బాదుతున్నాడు. ఎక్కడా లేని విధంగా ఏపీలో నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను తదితర పన్నులు పెంచి బాదుడే బాదుడు అంటన్నాడు.

ఎక్కడా లేని విధంగా చెత్తపన్ను విధించి పేదలను దోపిడీ చేస్తున్నాడు. కరెంట్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. పొలాల వద్ద రైతులు ఎప్పడు కరెంటు వస్తుందా అని కళ్లల్లో వత్తులు పెట్టుకొని చూస్తు్న్నారు.

చంద్రబాబునాయుడు హయాంలో రూ.4వేలకు దొరికే ఇసుక ఇప్పుడు రూ.18 వేలు పలుకుతోంది. విద్యుత్ సరఫరా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ప్రయాణించే ట్రాఫిక్ లో ఒక పాప చనిపోతే దిక్కులేదు.

కూలీనాలీ చేసుకునేవారి వద్ద నుండి వ్యాపారస్థుల వరకు బాధపడుతున్నారు. మూడు సంవత్సరాల కాలంలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. రైతులు నష్టపోయేలా వ్యవహరిస్తున్నాడు. సామాన్యుడికి రూ.2 వందలు వచ్చే కరెంటు బిల్లు రూ. 8 వందలు వస్తోంది. ఒక్కో యూనిట్ పై దాదాపు 50 శాతం చార్జీలు పెంచారు. సామాన్యుడు ప్రయాణించే ఆర్టీసీ చార్జీలు భయంకరంగా పెంచేసి ప్రజల నడ్డి విరిచారు. చేతకాని ప్రభుత్వ సలహాదారులను పెట్టుకొని లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని తగలేస్తున్నాడు.

వారి సలహాలు తీసుకొని రాష్ట్రానికి ఏం ఉద్ధరించారో చెప్పాలి. నామినేటెడ్ పదవులు, ఛైర్మన్ పదవులు ఇచ్చారు. వాటివలన ఉపయోగమేమిటో చెప్పాలి. దివాలాకోరు రాజకీయలు నడుస్తున్నాయి. జగన్ చేతకాని దద్దమ్మ ప్రభుత్వం నడుస్తోంది. గ్యాస్ పై ఒక్క రూపాయి సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వముంది. పెట్రోల్, డీజిల్ పై ఇతర రాష్ట్రాల కంటే నాలుగు శాతం అధికంగానే ధరలు ఉన్నాయి. జగన్ తన అనుయాయులకు దోచిపెడుతున్నాడు.

చెత్తపై పన్ను వేసిన దౌర్భాగ్యపు ప్రభుత్వమిది. దినపత్రికలు తెరిస్తే చాలా ఏదో ఒక దానిపై పన్ను పెంచినట్లు వుంటుంది. పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. ప్రతి ఒక్కరిపై అప్పు ఉంది. ప్రతి ఒక్కరు జగన్ ప్రభుత్వాన్ని ఛీదరించుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్ని పూర్తిగా నాశనం చేశాడు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం లేదు. ఇదొక బూటకపు ప్రభుత్వం. జగన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు పరిపాలన సాగిస్తున్నాడు.

ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మానాలి. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ హితవు పలికారు.

 

LEAVE A RESPONSE