– IAS,IPS ల వ్యవస్థ ను సీఎం కేసీఆర్ ధ్వంసం చేశాడు
– ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
14 మంది సీనియర్ IAS ఆఫీసర్లని వదిలేసి సోమేశ్ కుమార్ ని చీఫ్ సెక్రటరీ గా అక్రమంగా చేశారు. సోమేశ్ కుమార్ ఆంధ్రాకి కేటాయించబడిన ఆఫీసర్…అతనిపై ఎందుకు అంత ప్రేమ సీఎం కేసీఆర్ కి?రజత్ కుమార్ వ్యవహారం ఇటీవల బట్టబయలైంది.
2016 బ్యాచ్ IAS ఆఫీసర్లకి 2 సంవత్సరాల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం కి రావడానికి IAS, IPS ఆఫీసర్లు వెనుకడుగు వేస్తున్నారు. TRS కి తొత్తుగా వ్యవహరించే అధికార్లకే మంచి హోదా ఇస్తుంది TRS ప్రభుత్వం.
ఎలక్షన్లలో అక్రమాలకు పాల్పడ్డందుకు రజత్ కుమార్ కి ఇరిగేషన్ లో పోస్టింగ్ ఇచ్చింది అధికార పార్టీ. తెలంగాణ లో IAS, IPS లను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటున్న తీరును పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తాను.
అధికార నేతలకు తొత్తులుగా కొందరు IAS, IPS ఆఫీసర్లు పనిచేస్తున్నారు. కేసీఆర్ నాశనం చేసిన వ్యవస్థ తోనే…కేసీఆర్ పతనం అవుతాడు. ప్రతిపక్ష నేతలకు చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ అపాయింట్మెంట్ ఇవ్వరు. తెలంగాణ రాష్ట్రం సీఎం సొంత జాగిరులా ప్రవర్తిస్తున్నాడు.