మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదాం

-మహాత్ముడు సూచించిన గ్రామస్వరాజ్యం దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలన
-మహాత్మాగాంధికి ఘన నివాళులర్పించిన మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

*జాతిపిత మహాత్మాగాంధి వర్ధంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరంలో మహాత్మాగాంధీ బ్రిటీష్ వారిపై చేసిన శాంతియుత పోరాటం అందరికి ఆదర్శమైందని అన్నారు. ఆ మహనీయుని త్యాగాల వల్లనే నేడు భారతీయులందరూ స్వేఛ్చా స్వాతంత్ర్యాలను అనుభవించగలుగుతున్నారని అన్నారు. దేశంలో ప్రధాన మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చాలామంది పనిచేశారని, కానీ గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. గ్రామ స్వరాజ్యం సాధించే క్రమంలోనే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసి రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. మహాత్ముని స్పూర్తిగా తీసుకుని అందరం ముందుకు నడవాలని కోరారు.

లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అహింసే ఆయుధంగా బ్రిటీష్ వారిపై పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం సంపాదించిన పూజ్య బాపూజి ప్రజల హృదయాలలో చిరస్ధాయిగా నిలిచిపోయారన్నారు. గాంధీ ఆలోచనలను పుణికిపుచ్చుకుని ఆయన ఆశయాల సాధన దిశగా రాష్ర్టంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామస్వరాజ్యం దిశగా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు.మహాత్ముని ఆశయాలను భవిష్యత్తులో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కూడా మరింత బలంగా ప్రజలలోకి తీసుకువెళ్తుందని ప్రతిజ్ఞ పూనుతున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ కనకారావు మాదిగ, నాయిబ్రాహ్మణ కార్పోరేషన్ డైరక్టర్ పుల్లయ్య పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply