దేశ ప్రజాస్వామ్యం క్లిష్ట పరిస్థితిలో ఉంది

– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

బిజెపి నాయకత్వంలో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా.దేశంలో బావ స్వేచ్ఛ గురించి మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు పెడుతున్న బిజెపి ప్రభుత్వం.దేశ సంపద దేశ ప్రజలకే చెందాలని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ పై బిజెపి అసత్య ప్రచారం చేస్తున్నది. ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం, ప్రగతిశీల వాదాన్ని కాపాడడం కోసం రాహుల్ గాంధీ తొమ్మిదేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై మాట్లాడిన రాహుల్ గాంధీని చూసి బిజెపి భయపడుతున్నది.

ప్రజా సమస్యల గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించిన అంశాలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీని పార్లమెంటుకు రాకుండా కుట్రలు చేస్తున్నది.బిజెపి పాలకుల ఉడత ఊపులకు రాహుల్ గాంధీ భయపడడు.దేశంలో ప్రజాస్వామ్యం కాపాడడం కోసమే రాహుల్ గాంధీ దేశ ప్రజల వెంట ఉంటాడు. ఆర్థిక నేరానికి పాల్పడే ఆదాని, లలిత మోడీ, నీరవ్ మోడీ లకు దేశ సంపద దోచిపెడుతున్న మోడీ, అమిత్ షా.ఆర్థిక నేరస్తులకు కొమ్ముకాస్తున్న బిజెపి పాలకులతో దేశానికి పెనుసవాల్ గా మారింది.దేశ ప్రజలు రాహుల్ వెంట ఉన్నారు వారి గుండెల్లో కాపాడుకుంటారు.నేను చేస్తున్న పాదయాత్రలో దేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్యంపై దాడిని వివరిస్తూ ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రజలను సమయాత్తం చేస్తున్నాను.

పాదయాత్రలు వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని శాంతియుతంగా సత్యాగ్రహ దీక్షతో బాపూజీ మార్గంలో చేస్తాను.దేశ సంపద వనరులను క్రోనీ క్యాపిటలిస్టులకు దోచిపెడుతున్న బిజెపిని ఈ దేశంలో లేకుండా చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.పారిశుద్ధ్య కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వని టీఆర్ఎస్ ప్రభుత్వం.బడ్జెట్ లో అత్యంత అతి స్వల్పంగా నిధులు కేటాయిస్తూ విద్య వైద్యాన్ని నిర్వీర్యం చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం. బిఆర్ఎస్ అవలంబిస్తున్న విధానాలతో గతంలో విద్య అభివృద్ధికి వేసిన పునాదులు కూలే పరిస్థితిని తీసుకొచ్చింది.విద్యను నిర్వీర్యం చేసి తెలంగాణను చీకటిగా మార్చే కుట్రకు తెరలేపిన టిఆర్ఎస్ ప్రభుత్వం.

Leave a Reply