– పనిగట్టుకుని ఈనాడు సిగ్గులేని జర్నలిజానికి పాల్పడుతోంది
– హైదరాబాద్ లో కూర్చొని రామోజీ ఏపీపై, జగన్‌గారిపై విషం చిమ్ముతున్నాడు
– మారకపోతే రామోజీకి ప్రజలే బుద్ధి చెప్తారు
– మీ వికృతమైన జర్నలిజానికి ప్రజలే సమాధి కడతారు
గన్నవరంలో తొడలు కొట్టడం కాదు..దమ్ముంటే అసెంబ్లీలో చర్చిద్దాం రా బాబూ..!
– నీలాంటి పిరికిపందతో కొట్లాట ఏంటి బాబూ…?
– నేను ఇంటికి వస్తే.. పారిపోయిన చంద్రబాబు మాకు లగ్నం పెట్టడమేంటి..?
– 2019లోనే ప్రజలు చంద్రబాబుకు లగ్నం పెట్టి ఆ పార్టీని రాజకీయ సమాధి చేశారు
– చీఫ్ మినిస్టర్ టు కామన్ మెన్‌కు నేరుగా రూ.2 లక్షల కోట్ల డీబీటీ ద్వారా ఇచ్చాం
– అభివృద్ధి, సంక్షేమాన్ని గడప గడపకూ రుచిచూపించిన సీఎం వైఎస్ జగన్.
– ప్రజలంతా జగన్ ని గుండెల్లో పెట్టుకుంటే…దుష్టచతుష్టయం మాత్రం విషం చిమ్ముతోంది
– మేం మేలు చేశాం కాబట్టే.. దమ్ముగా గడప గడపకూ వెళ్తున్నాం..మీకు వెళ్లే దమ్ముందా..?
– బీసీలను చంద్రబాబు బానిసలుగా చేస్తే జగన్ గారు బలవంతుల్ని చేశాడు.
– జగన్మోహన్‌రెడ్డి ని నేరుగా చూస్తే లోకేశ్‌కి ఫ్యాంటు తడిచిపోతుంది
– సింహం లాంటి జగన్ గారికి, పిల్లిలాంటి లోకేశ్‌కి పోటీనా..?
-:గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
తప్పుడు ఫోటోలు, తప్పుడు వార్తలతో ముఖ్యమంత్రిపై నిందలు వేయాలని కథనాలు రాసిన ఈనాడు పత్రికపై నిన్నటి నుంచి నిరసనలు తెలుపుతున్నాం. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మా పార్టీ తరఫున రామోజీని డిమాండ్ చేశాం.కానీ ఇంతవరకు ఎటువంటి క్షమాపణ వారి నుంచి రాలేదు. పార్టీ తరఫున ఈనాడు యాజమాన్యం మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. సిగ్గులేని జర్నలిజాన్ని, పనికట్టుకుని కల్పిత వార్తలతో, పాత ఫోటోలను వాడుతూ ఈనాడు తప్పుడు వార్తలను ప్రజలమీద రుద్దుతోంది. అందుకే ఈనాడు పత్రికపైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. రామోజీ చేస్తున్న వికృత చేష్టలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి.అయినా వారికి దున్నపోతు మీద వర్షం పడినట్లు ఉంది..చేసిన తప్పుకు ఏ మాత్రం వారిలో ప్రాయశ్చిత్తం కనిపించడం లేదు. హైదరాబాద్‌లో నాలుగు గోడల మధ్య కూర్చుని ఏపీపై, ముఖ్యమంత్రి జగన్ గారిపై విషం చిమ్ముతున్నాడు రామోజీ.నిత్యం జగన్‌గారిపై విషం చిమ్ముతున్న రామోజీ అండ్ కో మీరు నిజంగా మనుషులేనా..? మనిషికి ఉండాల్సిన లక్షణాలు కొంచెం కూడా మీలో కనిపించడం లేదు.
ఇప్పటికీ మారకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు:
రామోజీరావు..ఇప్పటికీ నువ్వు మారకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు..ప్రజల నుంచి ప్రజా వ్యతిరేకత చవిచూడక తప్పదు.ఇప్పటికైనా మార్పు తెచ్చుకో రామోజీ..అభివృద్ధి, సంక్షేమం అంటే ఈ విధంగా ఉంటుందా అని ప్రజలకు రుచిచూపించిన వ్యక్తి వైఎస్ జగన్. అందుకే ప్రజలంతా మావాడంటూ గుండెల్లో పెట్టుకుంటే వీళ్లు మాత్రం విషం చిమ్ముతున్నారు.మీ పతనం ఆరంభమైంది..మీ వికృతమైన జర్నలిజం కాలి మసైపోబోతొంది. మీ వికృతమైన పచ్చ కామెర్ల రోగం ప్రజల చేత దహనం కాబోతోంది.
మేం దమ్ముగా గడప గడపకూ వెళ్తున్నాం..మీకు అలా వెళ్లే దమ్ముందా..?:
గడప గడపకు మన ప్రభుత్వం విఫలమైందా..? మేం ఫెయిలైతే నువ్వు గడప గడపకు కు వెళ్లొచ్చుగా..?పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఏం చేశాను అనేది చంద్రబాబు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాడు. మేం ఫెయిల్ అవ్వడమేంటి.. ప్రతి గడపకూ మేం వెళ్తున్నాం అదే మా ధైర్యం. మాకు విశాలమైన హృదయం ఉంది..మా లీడర్, మా జగనన్న 32 పథకాలతో ప్రజల మన్ననలు, దీవెనలు పొందాడు.అందుకే మేం ధైర్యంగా, దమ్ముగా గడప గడపకూ వెళ్తున్నాం. మేం ఫెయిలయ్యాం అని చెప్తున్నావ్..మరి మీరు మీ పార్టీ వారు వెళ్లలేకపోతున్నారెందుకు..?ప్రతి కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమం అంటే ఏమిటో రుచిచూపించిన వ్యక్తి వైఎస్ జగన్. అవ్వా తాతలకు మొదటి తేదీనే ఠంఛన్‌గా పింఛన్ అందిస్తున్నారు సీఎం జగన్ .రైతు భరోసా, అమ్మఒడి, విద్యా దీవెన లాంటి అన్ని పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయి.2 లక్షల కోట్ల రూపాయలు చీఫ్ మినిస్టర్ టు కామన్ మెన్‌కు వెళ్లాయి. జగనన్న బటన్ నొక్కగానే అక్కచెల్లెమ్మల ఎకౌంట్లలోకి డబ్బులు వెళ్తుండం దేశంలో ఎక్కడైనా చూశావా చంద్రబాబు..?
గన్నవరంలో తొడలు కొట్టడం కాదు..దమ్ముంటే అసెంబ్లీలో చర్చిద్దాం రా..:
సామాజిక న్యాయం అంటే ఏంటో చూపించిన నేత వైఎస్ జగన్. గన్నవరంలో తొడలు కొట్టడం కాదు…బీసీలపై చర్చకు నువ్వు సిద్ధమా చంద్రబాబూ..? వచ్చే నెల 14 తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి..అసెంబ్లీ సాక్షిగా సామాజిక న్యాయంపై చర్చిద్దాం.నీ 14 ఏళ్ల పరిపాలన కాలంలో నువ్వేమి చేశావో…ఈ మూడేళ్ల 8 నెలల కాలంలో జగన్ గారు ఏం చేశారో చర్చిద్దాం.రాలేడు…చర్చ చేయలేడు…చర్చ అంటే చంద్రబాబు పారిపోతాడు.. బీసీలను చంద్రబాబు బానిసలుగా చేసి వాడుకుంటే జగన్ గారు మమ్మల్ని బలవంతుల్ని చేశాడు.చేపలు పట్టుకునే కులంలో పుట్టిన నా అన్నలను తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెట్టాడు. కల్లు గీసుకునే నా బీసీ లను తీసుకెళ్లి రాజ్యసభ మెట్టెక్కించాడు.రాళ్లు కొట్టుకునే నా వడ్డెరలను శాసనమండలిలో కూర్చోబెట్టాడు. బలహీనవర్గాల్లో ఇంకా మిగిలిన వారిని తీసుకొచ్చి రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తున్నాడు.దమ్ముంటే చర్చకు రా…నువ్వు ఏడవకుండానే నీ కళ్లు తిరిగేటట్లు చేస్తాం.
నీలాంటి పిరికిపందతో కొట్లాట ఏంటి బాబూ?
నీలాంటి పిరికిపంద కొట్టుకోడానికి లగ్నం పెట్టడం ఏమిటి..?నేను స్వయంగా నీ ఇంటికి వచ్చా…నీ ఇంటిదగ్గర వచ్చి వినతిపత్రం ఇద్దామంటే పారిపోయిన ఈ చంద్రబాబునాయుడు మాకు లగ్నం పెడతాడట..?తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడుకి రాష్ట్ర ప్రజలు 2019లోనే లగ్నం పెట్టి దహనం చేసేశారు.45 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావ్..లగ్నాలు పెట్టడానికి సిగ్గు లేదా..? నువ్వు ప్రతిపక్ష నాయకుడివి…నీకు స్వేచ్ఛ ఉంది…అసెంబ్లీకి రా…మాట్లాడుకుందాం.ఇంటికి పోతే దాక్కుంటాడు..కనీసం వినతిపత్రం తీసుకోవడానికి కూడా బయటకు రాలేని పిరికిపంద.
సింహం లాంటి జగన్ కి, పిల్లిలాంటి లోకేశ్‌కి పోటీనా..?
చిటికెలు, ఈలలు వేయడం ఏంట్రా…బాలకృష్ణ డైలాగులు ఏమైనా రాసిచ్చాడా..? జగన్మోహన్‌రెడ్డి ని నేరుగా చూస్తే లోకేశ్‌కి ఫ్యాంటు తడిచిపోతుంది. సింహం లాంటి జగన్ కి, పిల్లిలాంటి లోకేశ్‌కి పోటీనా..?సైతాన్ చంద్రబాబు అయితే పిల్ల సైతాన్ లోకేశ్.మీ పనిఅయిపోంది…మిమ్మల్ని ప్రజలు కాలగర్భంలో కలిపేశారు. మిమ్మల్ని పైకి ఎత్తాలని చూస్తున్న దుష్టచతుష్టయం కూడా కాలగర్భంలో కలిసిపోబోతోంది.5 కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన జగన్ గారిని మీరు ఇంచు కూడా కదల్చలేరు.
నిజమైన హంతుకులెవరో తేలాలి:
వివేకానందరెడ్డి హత్యపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారు.మేం కూడా నిజమైన హంతకులెవరో తేలాలనే కోరుకుంటున్నాం. ఆనాటి ముఖ్యమంత్రి కనుసన్నల్లో అప్పటి ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఎలాంటి దర్యాప్తు చేశారో అందరికీ తెలుసు. జగన్ కి వివేకా సొంత బాబాయి..ఆయన హత్యకు గురైతే బాధ ఉంటుంది. కానీ..వీళ్లు కుటుంబం లో చిచ్చులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు.