Suryaa.co.in

Andhra Pradesh

పవన్ కు డీల్ కుదిరించి.. ప్యాకేజీ సెట్ అయింది

– బీజేపీతో సంసారం.. చంద్రబాబుతో శృంగారంః ఇదీ పవన్ పార్టీ పరిస్థితి
– జనసేన కాదు.. అది “నారా-నాదెండ్ల” సేన
– రాజకీయం అంటే సొంత కళ్యాణం కాదు… లోక కళ్యాణం.
– పవన్ కు ఉన్నది బాబు.. కావాల్సింది ప్యాకేజీ
– పవన్ కు మంగళగిరిలో వేరే ఆఫీసు ఎందుకు, టీడీపీ ఆఫీసు ఉండగా..?
– రాజకీయ కరువు బాధితుడు పవన్ కు స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీలు అందాయ్
– టీడీపీ ప్రభుత్వంలో దుష్టచతుష్టయం-పవన్ ల కడుపు నిండింది.. జనం కడుపు ఎండింది
– 2019లో అన్ని చోట్లా గుండు గీశారు కాబట్టే.. జుట్టు పెంచుతున్నాడు
– ప్రతి నమస్కారంతోపాటు ప్రతి ఒక్కరికీ మంచి చేసే సంస్కారం జగన్ గారికే సొంతం.
– నిన్ను చిరంజీవికి తమ్ముడు అనాలా.. చంద్రబాబుకు దత్తపుత్రుడు అనాలా..?
– మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి ఎం. శంకరనారాయణ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు

టీడీపీతో డీల్ ఓకే అయిపోయిందని గత మూడు రోజులుగా పవన్ కల్యాణ్ పిచ్చి వాగుడు ద్వారా స్పష్టమవుతోంది. అది చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు వల్ల పుట్టిన పార్టీ. కాబట్టే, పవన్ కల్యాణ్ తనకు కులం లేదంటాడు, మతం లేదంటాడు, ప్రాంతం లేదంటాడు. అతనికి ఉన్నది చంద్రబాబు. కావాల్సింది ప్యాకేజీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని ఒక పేరు పెట్టుకున్నాడు. దొంగ తనకు తాను సాఫ్ట్ వేర్ ఇంజినీరు అని చెప్పినంతమాత్రాన అతను చేసే పనినిబట్టి అతను దొంగో కాదో తేలుస్తారు కానీ, అతను చెప్పిన మాటను బట్టి కాదు కదా..
అలాగే, టీడీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, జనసేన విముక్త ఆంధ్రప్రదేశ్ 2019లోనే చేసి చూపించేసరికి, పవన్ కల్యాణ్ కు మెంటల్ ఎక్కింది. గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ గుండు గీశారు కాబట్టే, పవన్ కు జుట్టు పెంచుకోవడం మీద అంత మమకారం.

ఇంతకీ వచ్చే ఎన్నికల్లో బాబు కోసం పోటీ చేస్తున్నావా లేక నీ కోసం నువ్వు పోటీ చేస్తున్నావా.. అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పలేదు.175కు 175 ఎమ్మెల్యే సీట్లలో, 25కు 25 లోక్ సభ సీట్లలో నీ బీ-ఫామ్ మీద అభ్యర్థులను నిలబెడుతున్నావా లేదా అంటే, దానికీ సమాధానం లేదు. తననుకాక, మరో సినీ నటుడ్ని నిన్న అమిత్ షా కలవటంతోనే పవన్ కల్యాణ్ కు ఇక టీడీపీ వైపు వెళ్ళిపోవాలన్న ఆత్రం మరింత పెరిగినట్టు ఉంది.

ఇక్కడ బీజేపీలో ఉన్నాడా లేదా అన్నది చెప్పకుండానే, సంసారం ఒకరితో… శృంగారం మరొకరితో అన్నట్టు బీజేపీ మిత్ర పార్టీగా చెబుతూనే ప్రతిరోజూ చంద్రబాబు డైలాగులనే వల్లె వేస్తున్నాడంటే… పవన్ కల్యాణ్ కు ప్యాకేజీ కుదిరింది. పర్యటన కూడా బహుశా టీడీపీ కోసం, టీడీపీ చెప్పినట్టు, టీడీపీ చెప్పిన నియోజకవర్గాల్లో టీడీపీ డైలాగులతో, స్క్రిప్టుతో కొనసాగుతుంది.

మంగళగిరిలో అసలు పవన్ కల్యాణ్ కు వేరే ఆఫీసు ఎందుకు..? ఈ మీటింగ్ ఏదో టీడీపీ ఆఫీసులోనే పెట్టుకుంటే పోయేది కదా.. వైఎస్ఆర్సీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అంటే.. దాని అర్థం ఏమిటి?
జగనన్న అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, 31 లక్షల ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ నిర్మాణం, వైఎస్ఆర్ రైతు భరోసా, రైతులకు ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన… ఇలా దాదాపు 40కు పైగా సంక్షేమ పథకాలు అమలు కాకూడదన్నదే బాబు, దత్తపుత్రుడి ఎజెండా.

దాదాపు 2.25 లక్షల కోట్ల బడ్జెట్ తోనే బాబు-పవన్ ల జాయింట్ గవర్నమెంటు ఈ పథకాలన్నింటినీ ఎందుకు ఇవ్వలేకపోయిందంటే… బాబు మేపే జీవుల్లో, జీవాల్లో, దుష్టచతుష్టయంతోపాటు పవన్ కడుపు కూడా బాగా నిండింది తప్ప, జనం కడుపు మాత్రం ఎండింది.

ఈ రూ. 1.65 లక్షల కోట్ల డీబీటీ మూడేళ్ళలోనే జరిగింది. మరి ఈ డబ్బంతా బాబు-పవన్ ప్రభుత్వంలో ఎక్కడికి పోయింది? రాయలసీమలో రెయిన్ గన్లు పట్టుకుని ఐదేళ్ళకు ఐదేళ్ళు కరువు ఉన్న రోజుల్లో రైతు కష్టం పవన్ కల్యాణ్ కు కనపడలేదు. ప్యాకేజీ ఒక్కటే కనిపించింది. పార్టనర్ షిప్ సమ్మిట్లు అని చొక్కాపైన వేసుకునే కోట్లు అద్దెకు తెచ్చి, దొంగ సంతకాలు పెట్టించి, పారిశ్రామిక అభివృద్ధి అన్న చంద్రబాబు రోజుల్లో, ప్రత్యేక హోదాను పోగొట్టిన పవన్ కల్యాణ్ మగతనం ప్యాకేజి కోసం పూర్తిగా చచ్చిపోయింది.

2018లో చంద్రబాబు తాకట్టు పెట్టిన ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ రాలేదు గానీ, ఆ ఐదేళ్ళు, గత మూడేళ్ళు మొత్తం… ఈ రాష్ట్రంలోని రాజకీయ కరువు బాధితుడు పవన్ కల్యాణ్ కు మాత్రం టీడీపీ నుంచి పూర్తి స్థాయి స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజి- లింగమనేని భూముల రూపంలోనో, గాజువాక, భీమవరం స్పాన్సర్ల రూపంలోనో టీడీపీయే ఇచ్చిన జనసేన బీ-ఫామ్ ల రూపంలోనో వీరి మధ్య అవగాహన అద్భుతంగా వర్థిల్లింది.

ఇప్పుడున్నది కూడా జనసేన కాదు. అదంతా నారా-నాదెండ్ల సేన.గ్లాసు బాబుది.. డోస్ పవన్ కు..రాయలసీమ మీద ఉన్నట్టు ఉండి మమకారం పుట్టేసింది. పవన్ కల్యాణ్ ప్రసంగాల్లో సగం సేపు కంటే ఎక్కువ టైమ్ నేను ఇలాంటివాడిని, నేను అలాంటివాడిని అని చెప్పుకుంటాడు. లేదా నాకు ఈ ఫీలింగ్స్ లేవు, ఆ ఫీలింగ్స్ లేవు అని చెప్పుకుంటాడు. తన గురించి తాను మాట్లాడటానికే, ప్రెస్ మీట్లు, బహిరంగ సభల్లో ప్రసంగ సమయం అంతా ఉపయోగించుకునే ఈ వివరణల జీవి, జనం గురించి ఎప్పుడు ఆలోచించాడు…?

రాజకీయం అంటే సొంత కళ్యాణం కాదు… లోక కళ్యాణం
నవరత్నాలు, ఇతర పథకాల గురించి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్న ఇలాంటి వ్యక్తులు.. ఈ రాష్ట్రంలో పేదల పాలిట శత్రువులు.-తన అన్నని జగన్ గారి ఇంట్లో బాగా చూసుకున్నా, తాను ఓడిపోయిన భీమవరంలో ఆలింగనం చేసుకున్నా తట్టుకోలేకే అన్నను అవమానించారంటూ ఏకంగా విపరీత వాదనలు చేస్తున్నాడు. ప్రజలకు మేలు చేయడమే ప్రజాస్వామ్యంలో సంస్కారం. ప్రతి నమస్కారంతోపాటు ప్రతి ఒక్కరికీ మంచి చేసే సంస్కారం జగన్ గారికే సొంతం.

రాజకీయం అంటే సినిమా కాదు. సినిమాల్లో థానోస్ లు ఉంటారు. రాజకీయాల్లో విలన్లని జనం ఎప్పటికప్పుడు చావబాదుతూనే ఉంటారు.బహుశా, 14 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నా, ఇప్పటికీ ఒక ఎమ్మెల్యే కూడా లేకపోయినా, ప్రజలు ఇంతగా ఛీ కొట్టినా, సిగ్గు, లజ్జ లాంటి పదాల్ని వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ జీవితంలో కూడా కాశీలోనో, గంగలోనో కలిపేసుకుని బతుకుతున్న వాళ్ళని ఏమనాలి..?చిరంజీవికి తమ్ముడు అనాలా.. చంద్రబాబుకు దత్తపుత్రుడు అనాలా..?

LEAVE A RESPONSE