ప్రకాశం జిల్లా దర్శి మునిసిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు,జిల్లా ఇంచార్జ్ మంత్రి పినుపే విశ్వరూప్ , దర్శి ఎమ్.ఎల్.ఏ.మద్దిశెట్టి వేణుగోపాల్, కర్నూల్ ఎమ్.ఎల్.ఏ.హఫీజ్ ఖాన్, మద్దిశెట్టి శ్రీధర్ తో కలసి దర్శి పి.జి.ఎన్ కాంప్లెక్ లో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో పాల్గొనడంతో దర్శి రాజకీయలు వేడెక్కాయి.దర్శి మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో లో మాజీమంత్రి శిద్దా రాఘవరావు రాకతో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది.
ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని అగ్రభాగాన నిలిపింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే చెల్లిందని అన్నారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్యవైశ్య సత్రాలు, వాసవి అమ్మవారి ఆలయాలు,సేవా ట్రస్ట్ లను ప్రభుత్వ పరిధి నుండి తొలగించి పూర్తిగా ఆర్యవైశ్య వర్గాలకు నిర్వహణ హక్కులు కల్పించి జి.ఓ ఇచ్చారని తెలిపారు. మన మనోభావాలను గౌరవించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మనం ఋణపడి ఉంటామని తెలిపారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్యవైశ్య వర్గాలకు కీలక పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కె దక్కిందని శిద్దా రాఘవరావు తెలిపారు. సమర్ధవంత పాలనతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతూ అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తున్నారని తెలిపారు…గ్రామ స్వరాజ్యం స్థాపనగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి దేశంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రోల్ మోడల్ అయ్యారని తెలిపారు.
ఆర్యవైశ్య సోదరులు అంకితభావం,ఐక్యతతో పని చేసి దర్శి మునిసిపల్ ఎన్నికలలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దర్శి ఎమ్.ఎల్.ఏ వేణుగోపాల్ మనకి ఎంతో సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రి కి బహుమతి ఇవ్వాలని కోరారు.మీ పరిచయాలను సద్వినియోగం చేసుకుని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పధకాలు, ప్రజల గుండెల్లో ఉన్నాయని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి లబ్ది చేర్చే విధంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాయని అన్నారు.రైతు, శ్రామిక,బడుగు,బలహీన,వెనకబడిన తరగతుల,ఇ. బి సి.ఆర్యవైశ్య, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన వారికి నేరుగా ఆర్ధిక సాయం అందించడం దేశంలోని ఒక కొత్త ఒరవడి సృష్టింఛాయని అన్నారు.ఇతర రాష్ట్రాల వారు మన పధకాలు అమలు తీరుతెన్నుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని శిద్దా తెలిపారు.
దర్శి పట్టణంలో జరుగుతున్న మొదటి మునిసిపల్ ఎన్నికల లో విజయ దుందిబి మ్రోగిస్తామని అన్నారు.20 వార్డ్స్ లో వైస్సార్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.దర్శి ప్రజల మనోభావాలు నాకు బాగా తెలుసని అభివృద్ధి కె ఓటు వేస్తారని అన్నారు.ఎమ్.ఎల్.ఏ వేణుగోపాల్ దర్శి అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తున్నారని అన్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గాలు ప్రజలతో సన్నిహితంగా ఉంటారని వారి సహకారంతో రాబోయే ఎన్నుకలలో విజయం సాధిస్తామని శిద్దా తెలిపారు.
ఎమ్.ఎల్.ఏ వేణుగోపాల్ మాట్లాడుతూ, దర్శిలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నట్లు తెలిపారు..ఆర్యవైశ్య వర్గాలకు అండగా ఉంటామని తెలిపారు.శిద్దా రాఘవరావు సహకారంతో దర్శి అభివృద్ధి చేస్తామని అందుకు అవసరమైన నిధులు ముఖ్యమంత్రి తో మాట్లాడి తెస్తానని అన్నారు. దర్శి లోని 20 వార్డ్స్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని కోరారు.