-99% ముందస్తు బెయిలుకు అవకాశాలు లేవు… ఇకనైనా డ్రామాలు ఆపండి
-పప్పు బెల్లం పంచినట్లుగా ఇళ్ల స్థలాలను పంచుతానంటున్న జగన్మోహన్ రెడ్డి
-పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి దేవస్థానం అయితే పార్లమెంటులో ఉండేది దేవుళ్లే కదా?
-ఎంపీ అయిన నన్ను గోడ్డును బారినట్లు బాధితులు కదా జగన్మోహన్ రెడ్డి?
-అమరావతి రైతులదే అంతిమ విజయం
-మూడు రాజధానులు కావాలని అమరావతిలో ఆందోళన చేయడం అసహ్యంగా ఉంది
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి 99% ముందస్తు బెయిల్ అవకాశాలు లేవు. ఇకనైనా డ్రా మాలను ఆపాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘు రామ కృష్ణంరాజు హితవు పలికారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 25వ తేదీన విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పరిణామాలు వేగవంతం అవుతాయని నేను చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది.
వెకేషన్ కోర్టు బెంచ్ లో వైయస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ 75 వ కేసుగా నమోదయింది. వెకేషన్ కోర్టు బెంచ్ న్యాయమూర్తి ఎన్ని కేసులను విన్నప్పటికీ, అవినాష్ రెడ్డి కేసు ఈరోజు విచారించే అవకాశాలు కనిపించడం లేదు. ఈనెల 30వ తేదీన కేసు విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినాష్ రెడ్డి తల్లికి బాగానే ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. అవినాష్ రెడ్డి తల్లికి బాగానే ఉన్నదని చెప్పిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ని కొట్టారట.
రేపు డాక్టర్లను కూడా కొడతారేమో. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా సీఐని తిట్టి వెళ్ళిపోయారట. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పినా డాక్టర్లు బ్రతుకుతారా?, లేదా అన్నది అనుమానంగా మారిందని రఘురామకృష్ణం రాజు ఆందోళన వ్యక్తం చేశారు.
గత మూడు రోజులుగా విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం బాగానే ఉన్నదని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. అవినాష్ రెడ్డి తల్లికి వచ్చింది హార్ట్ ప్రాబ్లమా?, స్టమక్ ప్రాబ్లమా?? అన్నది అర్థం కావడం లేదు. ఆమె శరీరంలోని అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని వైద్యులు నిర్ధారించారు. ఒకవేళ గుండె సరిగ్గా పని చేయకపోతే స్టంటు వేయవచ్చు… ప్రస్తుతానికి అవినాష్ రెడ్డి తల్లి సురక్షితమైనని వైద్యులు పేర్కొన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వైద్యులు తమ నివేదికను వెల్లడించే సమయానికి, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారిస్తామని వెకేషన్ కోర్టు బెంచ్ పేర్కొంది.
మంగళవారం నాడు రాత్రి 7:30 గంటలకు వరకు వెకేషన్ కోర్టు బెంచ్ కేసులను విచారించినట్లు తెలిసింది. లిస్టు ప్రకారం వెళితే, గురువారం నాడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ వెకేషన్ కోర్టు బెంచ్ లో ముందస్తు బెయిల్ పిటిషన్ వాదనలను వింటే 99.9 శాతం బెయిల్ పిటిషన్ అప్లికేషన్ కొట్టివేస్తారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ఇవాళ కాకపోతే రేపైనా సిబిఐ అవినాష్ రెడ్డి ని అరెస్టు చేయాలి. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిబిఐ ముందుకు రావాలి. ప్రస్తుతానికి అవినాష్ రెడ్డి తల్లి సురక్షితంగా ఉన్నారన్నారు.
విశాఖలో స్వీయ పట్టాభిషేకం…
విశాఖలో స్వీయ ‘ పట్టా’ భిషేకం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అమరావతిలో తనది కాని భూముల్లో పేదలకు ‘ పట్టా’భిషేకం చేస్తానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తనది కానీ ఆస్తిని పేదలకు పప్పు బెల్లం మాదిరిగా పంచుతారట. దానికి సాక్షి దినపత్రికలో పేదలకు పట్టాభిషేకం అని రాయడం విడ్డూరంగా ఉంది. విశాఖపట్నంలో స్వీయ’ పట్టా’భిషేకం అట. అమరావతిలో మాత్రం పేదలకు పట్టాభిషేకం చేస్తానని చెప్పడం సిగ్గుచేటు. ప్రధానమంత్రి తో నీతి ఆయోగ్ సమావేశం లో పాల్గొనడానికి పాల్గొనడానికి హాజరయ్యే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా అపాయింట్మెంట్ కోరితే ఇచ్చే అవకాశాలు శూన్యమని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి
ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవస్థానం అని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పార్లమెంట్ లో ఉన్నవారు దేవుల్లే కదా… అటువంటి పార్లమెంటు సభ్యుడైన నన్ను జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గొడ్డును బాదినట్లు బాదారు. ఇప్పుడు పార్లమెంటు ప్రజాస్వామ్యానికి దేవస్థానం అని గుర్తుకు వచ్చిందా జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యానికి దేవస్థానం అయినటువంటి పార్లమెంటులో కూర్చునే దేవుడిలాంటి నన్ను దారుణంగా హింసించినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి దేవస్థానం అని పేర్కొంటున్న పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులను ఇంటి బయటనే కూర్చో పెట్టినప్పుడు , నేను కేకలు వేసి వారిని మీ ఇంట్లోకి తీసుకువచ్చిన విషయం గుర్తుకు లేదా? అని నిలదీశారు.
మూడు రాజధానులకు అనుకూలంగా, అమరావతికి వ్యతిరేకంగా ఆందోళన చేసేవారికి అమరావతిలో అనుమతిని ఇచ్చారు. అమరావతి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న మాజీ న్యాయమూర్తి శ్రావణ్ ను కూడ అరెస్టు చేసి సాయంత్రానికి వ్యక్తిగత పూచికత్తు పై విడుదల చేశారు. ఆ డ్రైవర్ సుబ్రమణ్యమును అనంత లోకాలకు పంపి, ఆయన శవాన్ని పార్సిల్ చేసిన అనంత్ బాబు ఆందోళనకు కూడా పర్మిషన్ ఇవ్వడం హాస్యాస్పదం. మూడు రాజధానులు కావాలని ఆందోళన చేస్తే విశాఖపట్నం, కర్నూలులో ఆందోళనవకు అనుమతులు ఇవ్వాలి.
కానీ అమరావతిలో అనుమతి ఇవ్వడం జుగుస్సాకరంగా, అసహ్యంగా ఉంటుంది. విశాఖపట్నంలో, కర్నూలులో కిరాయికి కూడా ఆందోళన చేసేవారు లభించగానే, అమరావతిలో ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని కోసం తమ స్థలాలను తీసుకొని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ, ఆందోళనలు చేస్తున్న రైతులు పాలకులకు పశువుల మాదిరిగా కనిపిస్తున్నారు. విశాఖలో కాపురం పెడతానని చెబుతున్న ముఖ్యమంత్రి, ఇంకా మూడు రాజధానుల కోసం ఆందోళనలను వెనుక నుండి చేపించడం సిగ్గుచేటు.
అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలంటే రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి ముందు తీసుకురావాలి. కనీస మౌలిక వసతులు కల్పించే వరకు ఇళ్ల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లభించవు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాన్ని మొదలు పెడితే మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అమరావతి రైతులకు జరిగింది అన్యాయం. పాలకులే ఘాతుకాలకు పాల్పడితే ప్రజలకు న్యాయం ఎక్కడ లభిస్తుంది. అంతిమ విజయం అమరావతి రైతులదే. ఈ ప్రభుత్వం దారుణంగా ఓడిపోవడం ఖాయం. శాంతియుతంగా న్యాయ సమ్మతంగా ప్రభుత్వ విధానాలపై పోరాటం చేద్దామని రఘు రామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు.