-సీఎం జగన్ చేతుల మీదుగా నేడు ఇళ్ల పట్టాల పంపిణీ
-సీఎం జగన్ పాలనలో ప్రజలకు ప్రతిరోజూ పండగే
-ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే చర్యల వెనుక పచ్చ హస్తం
-తంజావూరు ఘటన తీవ్ర దిగ్భ్రాంతికరం
-రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ రికార్డ్ స్థాయిలో ఉత్పాదన
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖపట్నంలోని పేదల సొంతింటి కల నిజం కాబోతోందని. నగరంలో అర్హులైన 1.23 లక్షల మందికి సీఎం జగన్ నేడు (గురువారం) ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలపై స్పందించారు. నగరంలో భారీగా పెరిగిన భూముల ధరలను పరిగణనలోకి తీసుకుంటే పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల విలువ రూ.10 వేల కోట్లకు పైనే ఉంటుందని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు ప్రతిరోజూ పండగేనని, ప్రతినెలా వివిధ రకాలైన ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. మే నెలలో జగనన్న విద్యాదీవెన, ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్ రైతు భరోసా, మత్స్యకార భరోసా పథకాలు ప్రారంభించనున్నారని అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే చర్యల వెనుక పచ్చ ముఠా హస్తం ఉందని, రూయా హాస్పిటల్ ఘటనలో బాబు హయాంలో విస్తరించిన ప్రైవేటు ఆంబులెన్సుల మాఫియా పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు పిడుగురాళ్ల స్టేషన్ పరిధిలో స్కూలు పిల్లాడితో ఫ్లెక్సీలు చింపించి నేరం చేసేలా పచ్చ నేతలు ఉసిగొల్పడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో వచ్చే నెల 7, 8 తేదీల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వైఎస్సార్ మెగా జాబ్ మేళా జరగబోతోందని, ఇందుకు సంబంధించిన పోస్టర్లను మంత్రులు, పార్టీ నేతలతో కలిసి బుధవారం ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. నిరుద్యోగ యువత ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తంజావూరు దేవాలయ రథోత్సవంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై 11 మంది ప్రాణాలు కోల్పోవడం దిగ్బ్రాంతికరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.
వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ 92% సామర్థ్యంతో ఉత్పాదన సాధించడం గర్వించదగ్గ విషయమని. కరెంటు లోటు సమయంలో శ్రమించిన ఇంజనీర్లు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. సీఎం జగన్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని అన్ని కేంద్రాల్లో ఉత్పాదన పెంచాలని కోరారు.