Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నానాటికి దిగజారుతోంది

– మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నానాటికి దిగజారుతోందని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే… రాష్ట్రంలో అన్నింటా వెనుకబాటుతనమే నెలకొని వుంది. 10వ తరగతి పరీక్షా ఫలితాలే అందుకు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ 30వ తేది నాటికి జరిగిన అడ్మిషన్లు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరకుండా ఉన్నారు. 2,50,00 మంది విద్యార్థులు బడి బయటే ఉన్నారు. 53వేల మంది విద్యార్థులను బడిలో చేర్చాం మిగిలిన విద్యార్థులను చేర్పించాలని కలెక్టర్ లకు ఆదేశాలిచ్చాం అని సీఎం అన్నారు. అన్నీ తప్పుడు సమాచారమే ఇచ్చారు.

ఈ తప్పుడు సమాచారం దేనికి సంకేతాలో సీఎం చెప్పాలి. సీఎం బటన్ నొక్కుడు కార్యక్రమాల్లో ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువగా ఉంటోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసత్యాలు మాట్లాడటం తగునా? అసత్యాలను కప్పిపుచ్చడానికి పొంతనలేని లెక్కలు చెబుతున్నారు. విద్యా వ్యవస్థ గురించి ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంటోంది. విద్యా వ్యవస్థలో అభివృద్ధి లేకున్నా ఉన్నట్లు చెబుతున్నారు. వరల్డ్ బ్యాంకు నుంచి నిధులు తెచ్చామని గొప్పలు చెబుతున్నారు. ఏ ప్రభుత్వాలు ఇంతగా సాధించనట్లు మాట్లాడుతున్నారు. జనవరి 31, 2022న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఎటువంటి నిబంధనలు లేకుండానే మా ప్రగతిని చూసి వరల్డ్ బ్యాంకు విద్యావ్యవస్థకు నిధులు ఇచ్చిందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.

25 సంవత్సరాల అనుభవజ్జులు ఇలా మాట్లాడటంలో అర్థంలేదు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారు. వాస్తవాలను వక్రీకరించారు. సత్యాలను అసత్యాలుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం సాధించిన ప్రగతి శూన్యం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సమగ్ర శిక్ష అభియాన్, సర్వశిక్ష అభియాన్ తదితర కార్యక్రమాలు కేంద్రం, విదేశీ సహాయంతో దిగ్విజయంగా జరిగాయి. 250 మిలియన్ డాలర్లు వైసీపీ సాధించిన ప్రగతిని చూసి ఇవ్వలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని చూసి వరల్డ్ బ్యాంకు విద్యావ్యవస్థకు నిధులిచ్చింది. సాల్ట్ పథకం ద్వారా నాడు నేడు పథకానికి నిధులు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నట్లు చెప్పుకుంటోంది.

బాధ్యతాయుతమైన సీఎం తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లోనూ అసత్యాలే. ఏ ప్రసంగంలో సీఎం నోరు ఇప్పినా అన్ని అబద్ధాలే. జగన్.. పింక్ డైమెండ్ మొదలుకొని టీడీపీ డీఎస్సీ పోస్టులను ఒక్క కులానికే కట్టబెట్టారని దుష్ర్పచారం చేయడం వరకు అన్నీ అబద్ధాలే చెబుతున్నారు. అన్నీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అసత్యాలనే కొనసాగిస్తున్నారు. అసత్యాలు చెబితే ప్రజలు నమ్ముతారని ముఖ్యమంత్రి విశ్వసిస్తున్నారు. సీఎం స్థానానికి ఉన్న ఔన్నత్యాన్ని దిగజార్చారు. 2018వ సంవత్సరంలో ప్రాథమిక విద్యాకు సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కొన్ని గణాంకాలు విడుదల చేసింది. టీడీపీ హయాంలో అడ్మిషన్లు తక్కువగా జరిగాయని, వైసీపీ హయాంలో ఎక్కువగా జరిగాయని మాట్లాడటం పచ్చి అబద్ధం. పెళ్ళి కానుక కార్యక్రమ ప్రారంభంలో మాట్లాడినవన్నీ అబద్ధాలే.

గత పాలకుల హయాంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో తక్కువ అడ్మిషన్లు జరిగాయనేది అబద్ధం. రాష్ట్రంలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంది. మూడున్నర సంవత్సరా ల్లో విద్యా శాఖకు ప్రభుత్వం కేటాయించిన నిధులు అతి తక్కువ. నాడు నేడు పేరుతో వైసీపీ నాయకులు నిధులను దోచుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో చేరడానికి విద్యార్థులు విముఖత చూపుతున్నారు. ఇంగ్లీష్ మీడియంకు టీడీపీ వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ రెడ్డి చేతగానితనంతోనే విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తేల్చి చెప్పారు.

LEAVE A RESPONSE