-రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రసహనంగా మారింది
– వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలు కట్టడి చేయటంలో ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్ధ ఘోరంగా విఫలమయ్యాయి
– కుప్పం చంద్రబాబు అడ్డా.. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు చంద్రబాబు వైపే
– తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రసహనంగా మారిందని ఎన్నికలు స్వేచ్చగా నిష్ఫక్షపాతంగా నిర్వహించటంలో ఎన్నికల కమిషన్, పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.
సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలు ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా అధికార పార్టీ దౌర్జన్యాలు కట్టడి చేయటంలో నీలం సాహ్ని గారు విఫలమయ్యారు. ఎన్నికల కమిషన్ గా ఉన్న నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణ తమ బాధ్యత కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమిషనర్ పదవి ఇచ్చినందుకు నీలం సాహ్ని గారు ఈ విధంగా ముఖ్యమంత్రి జగన్ రుణం తీర్చుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, పోలీసులు రాజ్యం నడుస్తోంది.
వైసీపీ కుప్పంలో టీడీపీని ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కోలేకనే పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతోంది. కుప్పం చంద్రబాబు అడ్డా.. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కుప్పం ప్రజలు చంద్రబాబు వైపే ఉంటారు. కుప్పాన్ని కొల్లగొట్టడం కోసం పోలీసుల సహకారంతో అరాచకాలు చేస్తున్నారు, మీ ఆటలు సాగవు. ఎంత దౌర్జన్యం చేసినా, టీడీపీ కార్యకర్తలను ఎంత ఇబ్బందులు పెట్టినా చివరకు ప్రజాస్వామ్యయే విజయం సాధిస్తుంది. చట్టబద్దంగా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నానని డీజీపీ గుండె మీద చేయివేసుకుని చెప్పగలరా? డీజీపీ పదవి ఇచ్చినందుకు గౌతమ్ సవాంగ్ ముఖ్యమంత్రి జగన్ రుణం తీర్చుకుంటున్నారా? కుప్పంలో టీడీపీ నేత రాజ్ కుమార్ ని ఎందుకు అరెస్టు చేశారు? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగే తీరు ఇదేనా?
కుప్పంలో టీడీపీ నేతలందర్నీ అరెస్టు చేసి వైసీపీ గెలిచినట్టు జెండాలు వేసుకోమనండి ఇక ఎన్నికలెందుకు? పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా? పోలీసు వ్యవస్ధ పనితీరుపై డీజీపీ ఎందుకు పునసమీక్ష చేసుకోవటం లేదు? కుప్పంలో రాజ్ కుమార్ ని వెంకటేష్ లను ఎందుకు అరెస్టు చేశారు? పెద్దిరెడ్డి మారు వేషంలో కుప్పంలోనే ఉన్నారు. ఆయనకు ఎందుకు ఇంత దిగజారుడుతనం. కుప్పంలో గెలవడానికి వైసీపీ అపశ్రుతులు, దొడ్డిదారులు, దొంగపనులు, అక్రమ మార్గాల్లో వెళ్తోంది. వైసీపీ తప్పుల్ని ఖండిచాల్సిన పోలీసు శాఖ వైసీపీకి సహకరించటం సిగ్గుచేటు. పోలీసుల వ్యవహారశైలి సిగ్గనించటం లేదా?
కుప్పంలో డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ పోలీసు వ్యవస్ధ పరువు తీస్తుంటే ఐపీయస్ ఆఫీసర్స్ అసోషియేషన్ ఏం చేస్తోంది? కుప్పంలో ప్రజలు స్వేచ్చగా ఓటేసే పరిస్థితి లేదు, ఇలాంటి పరిస్థితులో గతంలో ఎన్నడూ లేవు. ప్రజాస్వామ్యానికి విఘాతం, అఘాతం కల్పించి ఎన్నికలు సక్రమంగా జరగకుండా ఏకపక్షం చేస్తున్నది పోలీసులే. కుప్పంలో టీడీపీ ముఖ్య నాయకులందర్ని అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించటం దొంగతనం కాదా? వైసీపీ ఇన్ని అరాచకాలు చేస్తుంటే కుప్పంలో ఎన్నికల అధికారి నిద్రపోతున్నారా? ఆయన ప్రభుత్వ అధికారా ? లేక మంత్రి పెద్దిరెడ్డి పాలేరా, తాబేదారా ? గతంలో బీహార్ లో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు.
రాష్ట్రంలో డీజీపీ పని చేసిన రోజులన్నీ ఆయన సర్వీస్ లో చీకటి రోజులుగా మిగిలిపోతాయి, ఏపీ పోలీసు వ్యవస్ధ సవాంగ్ కు ముందు సవాంగ్ తర్వాత అన్నట్టు చరిత్రలో గౌతమ్ సవాంగ్ కు చెడ్డపేరు పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.అరాచకాలు, అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో గెలవటం ఒక గెలుపేనా ? దీని బదులు చెక్క భజన చేసుకోండి. కడప జిల్లా కమలాపురంలో ముఖ్యమంత్రి బందువు ఎమ్మెల్యే రవీంధ్రనాద్ రెడ్డి బహిరంగంగా డబ్బులు పంచుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? గతంలో పంచిన దానికంటే అదనంగా రూ. 5 వేలు పంచుతున్నారు. రాజంపేట 13 వ వార్డులో టీడీపీ ఏజెంట్ ని సీఐ బయటకు పంపటం ఏంటి? ఇదేనా పోలీసుల డ్యూటీ . డీజీపీ చెబితే టీడీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు పంపిస్తారా? ఇదేం పోలీసు వ్యవస్ద? డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి, కుప్పంతో పాటు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు స్వేచ్చగా ఓటేసే పరిస్థితి ఉందా? పోలీసులు అన్ని పార్టీలను సమానంగా చూస్తున్నారా? వైసీపీ ఇన్ని అరచకాలు చేసినా ఎన్నికల సంఘానికి, పోలీసులకు కనీసం చీమకుట్టినట్టు కూడా లేదు. కుప్పం పట్టణ టీడీపీ అధ్యక్ష్యుడు రాజ్ కుమార్.. నేనేం తప్పు చేశాను, నన్నెందుకు తీసుకెళ్తున్నారని అతను పోలీసుల్ని ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా పోలీసులు స్టేషన్ కి లాక్కెళ్లారు. పోలీసు వ్యవస్ధ పనితీరు ఇదేనా?
చట్టబద్దంగా, ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తానని నిరూపించుకునేందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ కి ఇంకా సమయం ఉంది. కుప్పంలో వైసీపీ మంత్రులు, నేతలు అరచకంగా వ్యవహరిస్తున్నారు,వారి అరాచకాలను అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసిన టీడీపీ నేతల్ని విడుదల చేయాలి. ఇన్ని అరచకాలు జరగుతున్నా ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం సరికాదు. నెల్లూరులో కూడా మంత్రి, వైసీపీ నేతలు టీడీపీ నేతలను వేధిస్తున్నారు. కుప్పంలో దొంగ ఓటర్లు ప్రోత్సహించే ఖర్మ పోలీసులకు పట్టింది.
డీజీపీ తన స్వామి భక్తిని నిరూపించటం కోసం పోలీసు వ్యవస్ధను ముఖ్యమంత్రి అధికార పార్టీ పాదాల దగ్గర తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం? కుప్పం చంద్రబాబు సేవలతో పునీతమైంది, కళ్లుమూసుకుని చంద్రబాబుకు అక్కడి ప్రజలు ఓట్లేస్తారు? వైసీపీ దొంగనాటకాలు, బోగస్ పనులు ప్రజలకు తెలుసు. వైసీపీ బోగస్ పనులకు డీజీపీ రాజముద్ర వేయటం ఎంతవరకు సమంజసం? పోలీసులు, ఎన్నికల సంఘం ఇకనైనా నిష్పక్షపాతంగా వ్యహరించి వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని వర్ల రామయ్య కోరారు.