Suryaa.co.in

Andhra Pradesh

వంగలపూడి అనితపై వైసీపీ పేటెమ్ కుక్కల తప్పుడు ప్రచారం నీచం

– వైసీపీ అక్రమాలను ప్రశ్నించే వారి వ్యక్తిత్వాన్ని హననం చేయటమే వైసీపీ పేటెమ్ కుక్కల కూలి పని
– టీడీపీ శాసనమండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ

టీడీపీ మహిళా నేత వంగలపూడి అనితపై వైసీపీ పేటెమ్ కుక్కల తప్పుడు ప్రచారం నీచం. వైసీపీ అక్రమాలను ప్రశ్నించే వారి వ్యక్తిత్వాన్ని హననం చేయటమే వైసీపీ పేటెమ్ కుక్కల కూలి పనిగా మారింది. మహిళల్ని కించపరిచేలా పోస్టులు పెడుతుంటే సాటి మహిళగా భారతి రెడ్డి ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి భార్యగా ఆమెకు కనీస బాధ్యత లేదా? అనితపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న వైసీపీ పేటెమ్ బ్యాచ్ కి ప్రజల చేతుల్లో చెప్పు దెబ్బలు ఖాయం.

LEAVE A RESPONSE