Suryaa.co.in

Features

ఈ అమ్మలకు పాదాభివందనాలు….

చక్కగా చీర కట్టుకుని, నుదుటిపై కుంకుమ పెట్టుకుని, మెడలో మంగళసూత్రం ధరించిన ఈ స్త్రీలు(మాతృ మూర్తులు) చూడడానికి సాధారణ గృహిణిలుగా కనిపిస్తున్నారు కదూ.. కానీ వారు సాధారణ మహిళలు కాదు వారంతా ఇస్రో శాస్త్రవేత్తలు!

చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన బృందంలోని వారు చంద్రయాన్ ప్రయోగానికి ముందు ఈ శాస్త్రవేత్తలు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని సందర్శించారు స్వామి వారి ఆశీర్వాదం పొందారు..సంస్కృతి సాంకేతికత వెనుక రాదు, దీనికి ఉత్తమ ఉదాహరణ ఈ చిత్రం.

దీనికి విరుద్ధంగా, కొందరు వ్యక్తులు స్వార్ధ చింతనతో, తెలియని తనంతో వారి స్వంత డబ్బా కొట్టుకోవడం కోసం, పూజలు మరియు అంత్యక్రియల ఆచారాలను మూఢనమ్మకం అంటారు
కానీ నేను నా హృదయపూర్వకంగా వీరికి నమస్కరిస్తున్నాను!
మన దేశానికి ఎంతో పేరుప్రతిష్టలు తెచ్చిన ఈ అమ్మలకు పాధాభివందనాలు….

– సంపత్‌రాజు

LEAVE A RESPONSE